Operation Sindoor : సిందూర్ దెబ్బకు పాక్ నెక్స్ట్ ఏ స్టెప్ వేయబోతుంది ..?
Operation Sindoor : ఈ మెరుపుదాడులతో భారత్ తన ధైర్యాన్ని మరోసారి చాటించగా, పాకిస్తాన్ మాత్రం భారీ ఒడిదుడుకుల్లో పడింది.
- By Sudheer Published Date - 04:41 PM, Wed - 7 May 25

పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాకిస్తాన్‌లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను భారత త్రివిధ దళాలు నేలమట్టం చేశాయి. ఈ మెరుపుదాడులతో భారత్ తన ధైర్యాన్ని మరోసారి చాటించగా, పాకిస్తాన్ మాత్రం భారీ ఒడిదుడుకుల్లో పడింది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ఓసీ వద్ద పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నప్పటికీ, పాకిస్తాన్ పరిమిత ప్రతిస్పందనకే పరిమితం అయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Lose Weight: ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. బరువు తగ్గడానికి చెమటలు చిందిస్తూ కష్టపడాల్సిన పని లేద
డిఫెన్స్ ఎక్స్‌పర్ట్, బ్రిగేడియర్ (రిటైర్డ్) గోవింద్ సిసోడియా వ్యాఖ్యానించినట్టుగా, పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభం, సైనిక శక్తిలో వెనుకబాటులో ఉండటం, అంతర్జాతీయ మద్దతు లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కి గట్టిగా స్పందించే స్థితిలో పాక్ లేదు. అలాగని పూర్తిగా మౌనంగా ఉండకపోవచ్చు. దేశ ప్రజలకు ఏదో చర్య తీసుకున్నామన్న మానసిక తృప్తిని కలిగించేందుకు పాకిస్తాన్ సంకేతాత్మకంగా స్పందించవచ్చు. కానీ భారత్‌ను ప్రత్యక్షంగా ఢీకొట్టే అవకాశం చాలా తక్కువ.
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు మిగిలింది ఒక్కటే.. ఉగ్రవాదానికి దూరంగా ఉండటం, శాంతి మార్గాన్ని అనుసరించడం. బ్రిగేడియర్ సిసోడియా సూచించినట్టుగా, 26/11 ముంబై దాడుల నిందితులను భారత్‌కు అప్పగించడం ద్వారా పాకిస్తాన్ మంచి సంకేతం ఇవ్వవచ్చు. ఇది పాకిస్తాన్‌పై ఉన్న అంతర్జాతీయ ఒత్తిడిని కూడా కొంతవరకూ తగ్గించగలదు. మొత్తంగా చూస్తే.. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఇచ్చిన సైనిక హెచ్చరికను పాకిస్తాన్ ఎలా స్వీకరిస్తుందనేది సవాల్ గా మారింది.