HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Indian Army Created History With Operation Sindoor Rajnath Singh

Rajnath Singh : ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం చరిత్ర సృష్టించింది: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ పూర్తిగా ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి జరిగిందని, ఉగ్రవాదుల స్థావరాలపై స్పష్టంగా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామన్నారు. పాక్‌ పౌరులపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, లక్ష్యం కేవలం దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ముష్కరులే అని స్పష్టం చేశారు.

  • By Latha Suma Published Date - 06:01 PM, Wed - 7 May 25
  • daily-hunt
Indian Army created history with Operation Sindoor: Rajnath Singh
Indian Army created history with Operation Sindoor: Rajnath Singh

Rajnath Singh : ఇది పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాల్లో కీలక మలుపు. ఉగ్రదాడిపై భారత్ గట్టి ప్రతిస్పందనగా మంగళవారం అర్థరాత్రి “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారత సైన్యం చేపట్టిన చర్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి సుమారు 80 మంది ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ మాస్టర్ స్ట్రోక్ తో ప్రపంచం ఒక్కసారిగా భారత్ వైపు చూసింది. ఈ నేపథ్యాన్ని వివరిస్తూ భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక్కడే వెళ్ళి లంకను తగలబెట్టిన హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించాం’’ అని ఆయన తెలిపారు. భారత్ తలెత్తుకుందంటూ, దేశ భద్రతకు ఎలాంటి భంగం జరిగినా భారత్ సమర్థంగా తిప్పికొడుతుందనే సందేశాన్ని ఈ ఆపరేషన్ ద్వారా ఇచ్చామని వెల్లడించారు.

Read Also: Operation Sindoor : ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం భారత్‌కు లేదు.. పాక్‌ ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తాం: అజిత్ దోవల్

ఆపరేషన్ పూర్తిగా ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి జరిగిందని, ఉగ్రవాదుల స్థావరాలపై స్పష్టంగా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామన్నారు. పాక్‌ పౌరులపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, లక్ష్యం కేవలం దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ముష్కరులే అని స్పష్టం చేశారు. ‘‘ఒక్కసారి ఉగ్రవాదులపై కఠినంగా బలప్రయోగం చేయకపోతే, వారు మరింతగా జాలీలు విస్తరిస్తారు. దేశ రక్షణకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని ఆయన అన్నారు. ‘‘త్రివిధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది. వారి అప్రమత్తత, ధైర్యసాహసాలు దేశాన్ని గర్వపడేలా చేశాయి’’ అని పేర్కొన్నారు.

రైట్ టు రెస్పాండ్ (Right to Respond) హక్కును వినియోగించి భారత్ తన ఆత్మరక్షణకు తగిన చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రధానిమోడీ నేతృత్వంలో దేశం శత్రువులకు తగిన బుద్ధి చెప్పిందన్నారు. ‘‘అత్యంత కచ్చితంగా, గౌరవంతో, రిస్క్ ఉన్నా కూడా దేశం కోసం పని చేసిన సైన్యానికి, వారికి మద్దతుగా నిలిచిన ప్రధాని మోడీకి అభినందనలు’’ అన్నారు రాజ్‌నాథ్ సింగ్. ఈ ఆపరేషన్ భారత సైన్య చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచిందని, దేశ ప్రజలు అందరూ తమ రక్షణ బలగాలపై గర్వపడాలని పిలుపునిచ్చారు.

Read Also: Operation Sindoor : సిందూర్ దెబ్బకు పాక్ నెక్స్ట్ ఏ స్టెప్ వేయబోతుంది ..?

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Operation Sindoor
  • pakistan
  • pm modi
  • Rajnath singh

Related News

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!

డాన్ నివేదిక ప్రకారం.. గత నాలుగు సంవత్సరాలలో పాకిస్తాన్‌లో మహిళలపై హింసకు సంబంధించిన మొత్తం 1,73,367 వివిధ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాల ప్రకారం.. మహిళలపై నేరాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుదలను చూపించింది.

  • Parliament Winter Session

    Parliament Winter Session: పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు.. డిసెంబ‌ర్ 1 నుంచి హీట్ పెంచ‌బోతున్నాయా?

  • Demonetisation

    Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

  • Pak Hackers

    Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

  • Vande Mataram

    Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

Latest News

  • Isro Moon Maps: చంద్రయాన్-2 పెద్ద విజయం.. చంద్రుని ధ్రువ ప్రాంతాల హై-క్వాలిటీ డేటా విడుదల చేసిన ఇస్రో!

  • Y+ Security: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి వై+ భద్రత.. ఏంటి ఈ భద్రతా వ్యవస్థ?

  • IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!

  • Electric Two-Wheeler: రూ. 65వేల‌కే ఎలక్ట్రిక్ టూ-వీలర్.. కేవలం 1000 మందికి మాత్ర‌మే ఛాన్స్‌!

  • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

Trending News

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd