India Vs China : అరుణాచల్‌పై వట్టి మాటలు కట్టిపెట్టండి.. చైనాకు భారత్ హితవు
India Vs China : మన దేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా విషం కక్కుతూనే ఉంది.
- By Pasha Published Date - 04:41 PM, Tue - 19 March 24

India Vs China : మన దేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా విషం కక్కుతూనే ఉంది. అది తమ భూభాగమే అంటూ డ్రాగన్ మరోసారి వితండ వాదం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోనిదే అని ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ‘‘అరుణాచల్ మా దేశంలో విడదీయరాని భాగం.నిరాధార వాదనలను వల్లె వేయడం ద్వారా వాస్తవాలు మారిపోవు’’ అని ఆయన పేర్కొన్నారు. అరుణాచల్‌ను చైనా ‘జాంగ్నాన్’ అని పిలుస్తుంటుంది. ఈ వాదనను భారత్ ఇవాళ ఘాటుగా తిప్పికొట్టింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా రక్షణ శాఖ ప్రతినిధి(India Vs China) చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను గమనించాం. ఈ వ్యవహారంలో నిరాధార వాదనలను రిపీట్ చేసినంత మాత్రాన అవి వాస్తవాలుగా మారిపోవు. ఆ ప్రాంతం ఎల్లప్పుడూ మా దేశంలోనే అంతర్భాగం. మా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారు’’ అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మంగళవారం వెల్లడించారు.
Also Read :IPL 2024: కొత్త కెప్టెన్ వచ్చేశాడు… సన్ రైజర్స్ రాత మారుతుందా ?
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా బార్డర్‌లో ‘సేలా’ సొరంగ మార్గాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ టన్నెల్ ద్వారా బార్డర్‌లోని తవాంగ్ ప్రాంతానికి భారత సైనిక బలగాలను, ఆయుధాలను తరలించడం చాలా సేఫ్, చాలా ఈజీ!! అందుకే ఈ టన్నెల్ ప్రారంభమైనప్పటి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌పై విషం కక్కే తంతును చైనా ఒక సీరియల్‌గా కంటిన్యూ చేస్తోంది. సైనికపరంగా సరిహద్దుల్లో భారత్ బలోపేతం కావడాన్ని చైనా ఓర్వలేకపోతోంది. చైనా బార్డర్‌లో ఇటీవల కాలంలో సైనికుల సంఖ్యను భారత్ చాలా వరకు పెంచింది. దీనిపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. బార్డర్‌లో సైనికుల సంఖ్యను పెంచుతూ తమతో స్నేహం, శాంతి గురించి మాట్లాడొద్దని భారత్‌కు చైనా హితవు పలికింది. దేశ ప్రయోజనాల కోసం భారత్ సైన్యాన్ని మోహరించడాన్ని కూడా డ్రాగన్ తప్పుపట్టడం దారుణం.