Vangaveeti Radha : జనసేన కోసం రంగంలోకి దిగుతున్న వంగవీటి రాధా..?
కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి రంగా వారసుడిగా రాధా కూడా ప్రచారంలో పాల్గొంటే చాలావరకు ప్రభావం ఉంటుందనే ఆలోచనతో ఉన్నారనేది సమాచారం
- Author : Sudheer
Date : 19-03-2024 - 4:31 IST
Published By : Hashtagu Telugu Desk
వంగవీటి రాధా (Vangaveeti Radha) జనసేన (Janasena) కోసం రంగంలోకి దిగబోతున్నారా..అంటే అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మే 13 న పోలింగ్ , జూన్ 04 న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. దీంతో ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడం తో అన్ని పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇదే క్రమంలో స్టార్ క్యాంప్యిన్లను సైతం పార్టీలు రంగంలోకి దింపుతున్నాయి. ఫలానా వ్యక్తి ప్రచారం చేస్తే..ఆ కులం ఓట్లు పడతాయని అన్ని అన్ని పార్టీలు ఆలోచిస్తూ ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే ఈసారి సినీ గ్లామర్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె సోమవారం రాత్రి తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Manohar), విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ కావడం చర్చ గా మారింది. ఈసారి టీడీపీలో టికెట్ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వంగవీటి రాధా. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో రాధాకు టికెట్ కేటాయిస్తారని ఆయన అనుచరులు భావించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో రాధాను పక్కన పెట్టి వేరే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాధా ఈసారి జనసేన తరుపున ప్రచారం చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి బలం చేకూర్చేలా రాత్రి మనోహర్ తో రాధా భేటీ అయ్యారు. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి రంగా వారసుడిగా రాధా కూడా ప్రచారంలో పాల్గొంటే చాలావరకు ప్రభావం ఉంటుందనే ఆలోచనతో ఉన్నారనేది సమాచారం. ఇప్పటికే కాపు నాయకులు కొందరు వైసీపీ లో చేరడంతో.. వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు రాధా వంటివారి సేవలు అవసరమేననేది జనసేన ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఇద్దరు నాయకులూ ఈ అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ పవన్ (Pawan kalyan) , రాధా ప్రచారం చేస్తే ఇక తిరుగుండదని అంటున్నారు. చూద్దాం రాధా మరి ప్రచారం చేస్తారో లేదో.
Read Also : Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్