HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Captures 2 Pakistani Pilots Alive In Akhnoor And Jaisalmer

Pakistani Pilots Captured: భారత్ అదుపులో ఇద్దరు పాక్ పైలట్లు.. ధ్వంసమైన కరాచీ పోర్ట్.. బీఎల్ఏ చేతిలోకి క్వెట్టా

శుక్రవారం ఉదయంకల్లా ఆ ఇద్దరు పైలట్లను(Pakistani Pilots Captured)అదుపులోకి తీసుకున్న అంశంపై అధికార వర్గాలు అఫీషియల్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

  • By Pasha Published Date - 12:20 AM, Fri - 9 May 25
  • daily-hunt
Pakistani Pilots Captured Rajasthan Akhnoor Jaisalmer India Pakistan Indian Army Jf 17 Jf 17 Fighter Jet

Pakistani Pilots Captured: గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పాకిస్తాన్‌కు చెందిన మూడు యుద్ధ విమానాలను భారత సేనలు కూల్చేశాయి. వీటిలో ఒక యుద్ధ విమానాన్ని రాజస్థాన్‌లోని జైసల్మీర్‌ వద్ద,  మరో ఫైటర్ జెట్‌ను జమ్మూకశ్మీరులోని  అఖ్నూర్ టౌన్ వద్ద భారత ఆర్మీ కూల్చింది.  ఈ రెండు యుద్ధ విమానాలను కూల్చగానే.. వాటిలోని పైలట్లు పారచూట్ల సాయంతో భూమిపైకి సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. వారిని వెంటనే అక్కడు భారత భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. పాకిస్తాన్ చేపట్టిన ఆర్మీ ఆపరేషన్‌తో ముడిపడిన సమాచారాన్ని రాబట్టేందుకు వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయంకల్లా ఆ ఇద్దరు పైలట్లను(Pakistani Pilots Captured)అదుపులోకి తీసుకున్న అంశంపై అధికార వర్గాలు అఫీషియల్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం నాటికి భారత్ – పాక్ సరిహద్దుల్లో యుద్ధ తీవ్రత మరింత పెరుగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Also Read :Pak PM House: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుడు.. ఎలా ?

కరాచీ ఓడరేవును ధ్వంసం చేసిన భారత నౌకాదళం

ఎందుకంటే.. గురువారం అర్ధరాత్రి సమయానికి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. అదేమిటంటే.. పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీకి చెందిన ఓడరేవును భారత నౌకాదళం ధ్వంసం చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్ల దాడిలో కరాచీ ఓడరేవు బాగా ధ్వంసమైనట్లు సమాచారం అందుతోంది. ఇది పాకిస్తాన్‌ ప్రతిష్ఠకు కోలుకోలేని దెబ్బ. కరాచీకి చేరువలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ ఉందని అంటున్నారు. అదే నిజమైతే.. పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరే ముప్పు ఉంది. మరోవైపు బెలూచిస్తాన్ రాజధాని నగరం క్వెట్టాను బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  అక్కడి నుంచి పాకిస్తాన్ భద్రతా బలగాలను తరిమికొట్టారు. భారత వాయుసేన కూడా క్వెట్టా నగరంపై దాడి చేసి పాకిస్తాన్ ఆర్మీ కీలక విభాగాలను ధ్వంసం చేసింది. తద్వారా అక్కడి పాక్ సేనలు డీలాపడ్డాయి. దీన్ని అదునుగా తీసుకున్న బీఎల్ఏ మిలిటెంట్లు క్వెట్టా నగరంపై పట్టును సంపాదించాయి.

Also Read :India Vs Pakistan: జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ బార్డర్లలో హైటెన్షన్.. పాక్ ఎటాక్స్.. తిప్పికొడుతున్న భారత్

రంగంలోకి ఆ మూడు దేశాలు.. 

ఎలాగైనా భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు సౌదీ అరేబియా, అమెరికా, ఇరాన్‌లు రంగంలోకి దిగాయి.  తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని ప్రకటించాయి. అయితే ఈ అంశంపై రేపటి వరకు భారత్, పాక్‌లు ఎలాంటి వైఖరిని తీసుకుంటాయనే దానిపైనే భవిష్యత్ పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ శాంతి స్థాపన దిశగా అడుగులు పడకుంటే.. దెబ్బతినేది పాకిస్తానే. ఎందుకంటే ఇప్పటికే పాక్ ఆర్థికంగా దివాలా తీసింది. ఇంకో వారం రోజులు పాక్ యుద్ధంలో ఉంటే .. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు మరింత  పెరుగుతాయి. ఆఫ్రికాలో అధ్వాన స్థితిలో ఉన్న పలు దేశాల తరహా దుస్థితిని పాక్ ప్రజలు కూడా చూడాల్సి వస్తుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Indian army
  • JF 17
  • JF 17 Fighter Jet
  • pakistan
  • Pakistani Pilots Captured
  • rajasthan

Related News

Trump Tariffs

Trump Tariffs : ట్రంప్ నోట మరోసారి ‘టారిఫ్స్’ మాట.. టార్గెట్ ఇండియానేనా?

Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) తరచూ భారత్‌పై విమర్శలు గుప్పించడం, వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • Asia Cup

    Asia Cup: ఆసియా క‌ప్ గెలిచిన భార‌త్‌.. కానీ ట్రోఫీ ఎక్క‌డా?

  • H1 B

    H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?

  • India

    India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

  • Surya Kumar Yadav

    SuryaKumar Yadav: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ‌రో సంచలన నిర్ణయం!

Latest News

  • OG Item Update : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘OG’లో స్పెషల్ సాంగ్

  • Sindoor : మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? సనాతన ధర్మంలో సింధూరం ప్రాముఖ్యత ఇదే!

  • Gas Cylinder : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

  • CBN – Delhi : అమిత్ షాతో చంద్రబాబు భేటీ

  • ‎Drinking Water at Night: రాత్రి సమయంలో నిద్ర పోయేముందు నీరు తాగవచ్చా, తాగకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే!

Trending News

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd