India Vs Pakistan: జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ బార్డర్లలో హైటెన్షన్.. పాక్ ఎటాక్స్.. తిప్పికొడుతున్న భారత్
ఈ మొత్తం పరిస్థితిపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(India Vs Pakistan), సీడీఎస్ సంయుక్తంగా సమీక్షిస్తున్నారు.
- By Pasha Published Date - 10:27 PM, Thu - 8 May 25

India Vs Pakistan: ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం తీవ్రరూపు దాల్చింది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ ఆత్మాహుతి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. జమ్మూలోని సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లు లక్ష్యంగా పాకిస్తాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. వీటిలో ఎనిమిది మిసైల్స్‌ను భారత సైన్యం కూల్చేసింది. దీంతో జమ్మూలోని ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూ, కుప్వారా, అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూకశ్మీరులోని ఉరి, సాంబా సెక్టార్ వైపుగా పాకిస్తాన్ రేంజర్లు విచక్షణారహిత కాల్పులు జరుపుతున్నారు. జమ్మూకశ్మీరులోని రాజౌరీలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్ సూసైడ్ డ్రోన్లు, రాకెట్ల దాడి వల్లే ఆ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. మొత్తంగా జమ్మూ పరిధిలో ఇవాళ సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఏడుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పలుచోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చేసింది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. జమ్మూ సహా పఠాన్‌కోట్, ఉధమ్‌పుర్‌లలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.
Also Read :ED Vs Lalu : త్వరలో పోల్స్.. లాలూపై ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్
- రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న భారత వాయుసేన వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని పాక్ వాయుసేన దాడులకు తెగబడింది. ఈక్రమంలో భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన పాకిస్తానీ యుద్ధ విమానాల్లో మూడింటిని భారత గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసింది. వీటిలో 2 జేఎఫ్ 17 యుద్ధ విమానాలు ఉండగా, ఎఫ్16 యుద్ధ విమానం ఒకటి ఉంది.
- అరేబియా సముద్రాన్ని ఆనుకొని ఉన్న గుజరాత్ తీరంలోని కచ్ ప్రాంతంలోనూ ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి.అక్కడ బ్లాకౌట్ ప్రకటించారు. విద్యుత్ సరఫరాను ఆపేశారు.
- బ్లాక్ అవుట్ నేపథ్యంలో ధర్మశాలలో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. గ్రౌండ్ వదిలివెళ్లాలని ప్రేక్షకులను అధికారులు ఆదేశించారు.
- ఈ ఉద్రిక్తతల కారణంగా భారత్‌లోని 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేశారు. ధర్మశాల, సిమ్లా, గ్వాలియర్, శ్రీనగర్, పాటియాలా, అమృత్‌సర్, చండీగఢ్ సహా 27 ఎయిర్‌పోర్ట్‌లు బంద్ అయ్యాయి. 430 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
- ఈ మొత్తం పరిస్థితిపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(India Vs Pakistan), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) సంయుక్తంగా సమీక్షిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల్ని అప్రమత్తం చేశారు.
Also Read :Pakistan Attack : అర్ధరాత్రి వేళ దాడికి పాక్ యత్నం.. బలంగా తిప్పికొట్టాం : భారత్
- పంజాబ్‌లోని గుర్‌దాస్‌పుర్ జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆస్పత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది.