Jharkhand : మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే..హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు..
Jharkhand : రేషన్‌కార్డుల రద్దు వల్ల జార్ఖండ్‌లో చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోవడం సర్వసాధారణమన్నారు. కానీ మా ప్రభుత్వంలో మాత్రం జార్ఖండ్ ప్రజలు రేషన్, పెన్షన్ పెంపు, మంచి పోషకాహారం పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
- By Latha Suma Published Date - 03:54 PM, Sun - 3 November 24

CM Hemant Soren : జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలక హామీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు చేశారు. మళ్లీ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే పీడీఎస్ కింద అందించే రేషన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో పాటు పెన్షన్ మొత్తాన్ని పెంపు చేయడంతోపాటు మరికొన్ని హామీలు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వం 5 కిలోల రేషన్ ఉచితంగా ఇస్తుండగా, దానిని 7 కిలోలకు పెంచుతామన్నారు. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలో ఇండియా అలయన్స్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీటిని అమలు చేస్తామని హేమంత్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 11 లక్షల మందికి రేషన్ కార్డులు రద్దు చేశారని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు.
రేషన్‌కార్డుల రద్దు వల్ల జార్ఖండ్‌లో చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోవడం సర్వసాధారణమన్నారు. కానీ మా ప్రభుత్వంలో మాత్రం జార్ఖండ్ ప్రజలు రేషన్, పెన్షన్ పెంపు, మంచి పోషకాహారం పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా మిగిలి ఉన్న వారిని కూడా పీడీఎస్‌లో చేర్చుతామని సోరెన్ చెప్పారు. ఇది కాకుండా మాయన్ సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జార్ఖండ్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంలో పిల్లలకు గుడ్లు, పండ్లు కూడా అందజేస్తామన్నారు. మా ప్రభుత్వం సామాజిక భద్రత విషయంలో అనేక చర్యలు తీసుకుందన్నారు. 40 లక్షలకు పైగా వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు సామాజిక భద్రతా పెన్షన్‌తో అనుసంధానించడం. శ్రామిక వర్గానికి పెన్షన్ వయస్సు 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గించడం. 18-50 సంవత్సరాల వయస్సు గల మహిళలకు మైయా సమ్మాన్ యోజన వంటి అనేక పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు.
Read Also: Amaran Collections : మూడు రోజుల్లో రూ.100 కోట్లను క్రాస్ చేసిన ‘అమరన్’