Amaran Collections : మూడు రోజుల్లో రూ.100 కోట్లను క్రాస్ చేసిన ‘అమరన్’
Amaran Collections : మూడు రోజుల్లోనే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.107 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. ఈ కలెక్షన్లతో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన నాలుగో తమిళ నటుడిగా శివ కార్తికేయన్ రికార్డు లో నిలిచారు
- By Sudheer Published Date - 03:49 PM, Sun - 3 November 24

తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘అమరన్’ (Amaran ) బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.107 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. ఈ కలెక్షన్లతో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన నాలుగో తమిళ నటుడిగా శివ కార్తికేయన్ రికార్డు లో నిలిచారు. ఈ ఘనత సాధించిన సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్, కమల్ హాసన్ సరసన శివ కార్తికేయన్ చేరారు.
అమరన్ సినిమాను రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేయగా.. ఈ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కింది. దీపావళి కానుకగా తమిళంతో పాటుగా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీపావళికి తెలుగులో క, లక్కీ భాస్కర్ రిలీజ్ అయ్యాయి వాటికి పోటీగా అమరన్ (Amaran) వచ్చింది. తమిళంలో కూడా ఈ సినిమాకు పోటీగా బ్రదర్, బ్లడీ బెగ్గర్ రిలీజ్ అయ్యాయి. ఐతే వీటిలో అమరన్ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మేజర్ ముకుంద్ వరద రాజన్ గా శివ కార్తికేయన్ (Shiva kartikeyan) అదరగొట్టాడు. ఆర్మీ మ్యాన్ ఫ్యామిలీ లైఫ్ ను ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా చూపించారు.
Read Also : Google Pay Laddoos : నవంబరు 7 లాస్ట్ డేట్.. ‘గూగుల్ పే’ లడ్డూలతో క్యాష్ బ్యాక్