Chess Board Station: చెస్ బోర్డ్ లా కనిపించే రైల్వే స్టేషన్ ను మీరు ఎప్పుడైనా చూసారా!
ఉత్తర భారత దేశములో ఒక ప్రధాన రైల్వే స్టేషన్, ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంది. నిర్మాణ శైలి పరంగా, చారిత్రకంగా ఈ రైల్వే ష్టేషన్ కు ఎంతో ఆకర్షణ ఉంది.
- By Maheswara Rao Nadella Published Date - 12:17 PM, Mon - 13 March 23

ఉత్తర భారత దేశములో ఒక ప్రధాన రైల్వే స్టేషన్, ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంది. నిర్మాణ శైలి పరంగా, చారిత్రకంగా ఈ రైల్వే ష్టేషన్ కు ఎంతో ఆకర్షణ ఉంది. ఈ స్టేషన్ గురించి ఆసక్తికర సమాచారాన్ని భారతీయ రైల్వే విభాగం ట్విట్టర్ లో షేర్ చేసింది.
‘‘మీకు తెలుసా? నవాబుల పట్టణం లక్నో రైల్వే స్టేషన్, చార్ బాగ్ లో ఉన్నది. అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో పై నుంచి చూస్తే చెస్ బోర్డ్ (Chess Board) మాదిరిగా కనిపిస్తుంది’’అని రైల్వే శాఖ పేర్కొంది. స్టేషన్ డోమ్స్, పిల్లర్లు చెస్ (Chess) పీసులు మాదిరిగా ఉంటాయని, ఎంతో వినూత్నమైన నిర్మాణ శైలితో ఎంతో మంది సందర్శకులను బాగా ఆకర్షిస్తోందని తెలిపింది
Did you know?
In the city of Nawabs, the Lucknow railway station, located at Charbagh, is a stunning architectural wonder that looks like a chessboard from above. pic.twitter.com/Z8RXt7adIC
— Ministry of Railways (@RailMinIndia) March 12, 2023
దీనికి నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ‘‘టూరిస్టులను పైకి తీసుకెళ్లి చూపిస్తారా? నేలపై నుంచి చూస్తే ఏమీ కనిపించదు’’అని ఓ యూజర్ తన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆర్కిటెక్చర్ అద్భుతాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా చూడాలని మరో యూజర్ పేర్కొన్నారు.
Also Read: Vitamin B12 Deficiency: ఈ ఆరోగ్య సమస్యలకు విటమిన్ బి12 లోపమే కారణం..

Related News

Corona Alert: కరోనాపై కేంద్రం హై అలర్ట్.. రెడ్ జోన్స్ గా పలు రాష్ట్రాలు!
శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1590 పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.