Five Women: భర్తలకు భారీ షాకిచ్చిన ఐదుగురు మహిళలు
కేంద్ర ప్రభుత్వం (Central Government) సాయం అందీఅందగానే ఐదుగురు వివాహితలు తమ భర్తలకు భారీ షాకిచ్చారు.
- Author : Maheswara Rao Nadella
Date : 08-02-2023 - 11:25 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర ప్రభుత్వం (Central Government) సాయం అందీఅందగానే ఐదుగురు వివాహితలు (Five Women) తమ భర్తలకు (Husband) భారీ షాకిచ్చారు. డబ్బు అకౌంట్లో పడ్డాక ప్రియుళ్లలను తీసుకుని పారిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) లోని బారాబంకీ జిల్లాల్లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనానికి దారి తీసింది. తమ భార్యలు చేసిన పని తెలుసుకుని బాధిత భర్తలు లబోదిబోమంటున్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం.. భూమి ఉన్న నిరుపేదలకు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థికసాయం అందిస్తున్న విషయం తెలిసిందే. బారాబంకీ జిల్లా నుంచి ఈ పథకం కింద మొత్తం 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. తొలి విడతగా ఇటీవల వారి అకౌంట్లలో రూ.50 వేలు జమ చేశారు. ఇలా డబ్బు అకౌంట్లలో పడగానే ఐదుగురు వివాహితలు (Five Women) తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పారిపోయారు. దీంతో.. వారికి రెండో విడత సాయం ఇవ్వొద్దంటూ బాధితులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Government Teacher: 12 ఏళ్లుగా సెలవే పెట్టని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు!