HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >India Promises To Stop Buying Russian Oil Us Comments

రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 16-02-2026 - 11:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Got India's commitment to stop buying Russian oil
Got India's commitment to stop buying Russian oil

Russian oil  రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదంటూ అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై ఇప్పటికీ భారత్ నోరు విప్పకపోవడం.. అమెరికా పదే పదే ఈ కామెంట్లు చేయడం అందరిలోనూ అనుమానాలను పెంచింది. ముఖ్యంగా మ్యూనిక్ వేదికగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో.. మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయమని తమకు హామీ ఇచ్చిందన్నారు.

భారత్-అమెరికా మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని అమెరికా చెప్పింది. దీనిపై భారత్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా రష్యా మాత్రం భారత్ మాకు ఆ విషయం చెప్పలేదని తేల్చింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి భారత్ చమురు కొనుగోలు చేసినా తమకు ఏ ఇబ్బంది లేదని చెప్పింది. ఈక్రమంలోనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో మరోసారి ఈ విషయంపై స్పందించారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపి వేసేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ తాజాగా ప్రకటించారు. జర్మనీలోని మ్యూనిక్ భద్రతా సదస్సులో ప్రసంగించిన ఆయన.. ఈ విషయంలో ఢిల్లీ నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని ధృవీకరించారు.

భారత్‌కు భారీ ఊరట!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ గురించి మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపివేసేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించిందని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందానికి ప్రతిఫలంగా భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారతీయ ఉత్పత్తులపై గతంలో విధించిన 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీంతో భారతీయ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తోంది. ఇదీ చూడండి: మా చమురు కొనుగోలు ఆపేస్తామని భారత్ చెప్పలేదు.. అమెరికాతో ట్రేడ్ డీల్‌ వేళ రష్యా సంచలన ప్రకటన

జాతీయ ప్రయోజనాలే పరమావధి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ తన వైఖరిని స్పష్టంగా చెప్తూ వస్తోంది. తక్కువ ధరకు లభించే రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా తన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమే తమ ప్రాధాన్యత అని ఢిల్లీ వాదిస్తూ వచ్చింది. అయితే అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక సమీకరణాలు వేగంగా మారాయి. అయితే వాణిజ్య యుద్ధం కంటే సహకారం మేలని భావించిన అగ్రరాజ్యం.. చమురు దిగుమతులపై ఆంక్షలు పెట్టేందుకు భారత్‌ను ఒప్పించడంలో సఫలీకృతమైందని రూబియో మాటల ద్వారా అర్థం అవుతోంది.

రష్యా చమురును నిలిపివేయడం వల్ల భారత్‌కు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. అమెరికా మార్కెట్లో లభించే సుంకాల మినహాయింపు ఆ నష్టాన్ని పూడ్చుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 25 శాతం సుంకాల రద్దు వల్ల ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. కానీ రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకపోతే.. ఈ రెండు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి మైత్రిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రష్యాకు బదులుగా భారత్ ఇకపై మిడిల్ ఈస్ట్ లేదా అమెరికా నుంచే ఎక్కువ చమురును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • india
  • Marco Rubio
  • Russian oil
  • Russian Oil Import
  • Russian Oil india
  • Us State Secretary Rubio

Related News

Cng Gas

CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర

  • US Secretary of State Marco Rubio meets with Modi.

    PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

Latest News

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd