One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మొదటి సమావేశం
వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ఇదే అంశంపై చరిస్తున్నాయి. ఈ విధానాన్ని కొన్ని పార్టీలు మద్దతు తెలిపితే మరికొన్ని పార్టీలకు మింగుడుపడటం లేదు
- Author : Praveen Aluthuru
Date : 06-09-2023 - 2:11 IST
Published By : Hashtagu Telugu Desk
One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ఇదే అంశంపై చరిస్తున్నాయి. ఈ విధానాన్ని కొన్ని పార్టీలు మద్దతు తెలిపితే మరికొన్ని పార్టీలకు మింగుడుపడటం లేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ మొదటి అధికారిక సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉంటుందని సమాచారం. అంతకుముందు రామ్‌నాథ్ కోవింద్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రామ్‌నాథ్ కోవింద్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
కమిటీలో మొత్తం 8 మంది ఉన్నారు. ఇందులో అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, ఎన్‌కె సింగ్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారీ ఇతర సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నుంచి తన పేరును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేయడం గమనార్హం.
ఏకకాలంలో దేశంమొత్తం ఎన్నికలు నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయలు ఆదా అవుతుందనేది కేంద్ర ప్రభుత్వ వాదన. ఒకే దేశం ఒకే ఎన్నికలు అమలు చేస్తే దేశం అంతటా ఒకేసారి లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. మోడీ నవంబర్ 2020లో ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ప్రసంగిస్తూ, వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది చర్చకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, భారతదేశానికి అవసరమని అన్నారు . భారతదేశంలో ప్రతి నెలా ఎన్నికలు జరుగుతున్నాయని, దీని వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలని మోడీ ఆకాంక్షించారు.
Also Read: Wedding : పెళ్లి కావాలని ఎంత మొక్కిన దేవుడు కనికరించలేదనే కోపంతో శివలింగాన్ని అపహరించిన యువకుడు