Wedding : పెళ్లి కావాలని ఎంత మొక్కిన దేవుడు కనికరించలేదనే కోపంతో శివలింగాన్ని అపహరించిన యువకుడు
యువకుడు మాత్రం తన పెళ్లి కోసం నిత్యం గుడికి వెళ్లి దేవుడికి పూజలు చేస్తూ వస్తున్నాడు. ఓ అందమైన అమ్మాయి తో పెళ్లి జరిగేలా చూడు స్వామి అని
- Author : Sudheer
Date : 06-09-2023 - 1:24 IST
Published By : Hashtagu Telugu Desk
కోట్లాదిమంది ప్రజలు నిత్యం దేవాలయాలకు (Temples) వెళ్తూ దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటుంటారు. కొంతమంది తమ కోర్కెలను తీర్చినందుకు మొక్కలు చెల్లిస్తే..మరికొంతమంది తమ కోర్కెలను తీర్చాలని వెళ్తుంటారు. ఇంకొంతమంది మాత్రం సాధారణంగా వెళ్లి దర్శించుకుంటారు. అయితే ఇక్కడ ఓ యువకుడు (Young Man) మాత్రం తన పెళ్లి (Wedding) కోసం నిత్యం గుడికి వెళ్లి దేవుడికి పూజలు చేస్తూ వస్తున్నాడు. ఓ అందమైన అమ్మాయి తో పెళ్లి జరిగేలా చూడు స్వామి అని ప్రతి రోజు ఉదయం..సాయంత్రం శివాలయానికి వెళ్లి మొక్కుతున్నాడు. అయితే ఎంత మొక్కిన పెళ్లి కావడం లేదనే కోపంతో ఏకంగా శివలింగాన్నీ అపహరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంభి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
కౌశంభి జిల్లా (Kaushambi District )కు చెందిన చోటూ అనే యువకుడు ప్రతి రోజు స్థానికంగా ఉన్న భైరవ బాబా (Bhairav Baba Temple) గుడికి వెళ్లేవాడు. తనకు త్వరగా పెళ్లి కావాలని, మంచి అమ్మాయి దొరకాలని దేవుడిని చుట్టూ ప్రార్థించేవాడు. అలా కనీసం నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశాడు . చివరకు అమ్మాయి దొరక్కపోవడంతో.. అసహనానికి గురైన చోటూ ఆగస్టు 31న శివలింగాన్ని అపహరించాడు. అయితే శివలింగం కనిపించకపోవడంతో మిగతా భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు.. భక్తులను విచారించారు. చోటూ అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించాడు. తాను ఎన్నో పూజలు చేసినప్పటికీ, అమ్మాయి దొరక్కపోవడంతోనే విసుగు చెంది శివలింగాన్ని అపహరించినట్లు తెలిపాడు. ఆలయానికి సమీపంలో చెట్ల పొదల్లో దాచిపెట్టిన శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also : CBN Arrest : రెండు రోజుల్లో అరెస్ట్, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు