Ex-Congress MLA Arrested: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. కారణమిదే..?
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే (Ex-Congress MLA) ఆసిఫ్ మహ్మద్ ఖాన్ (Asif Mohammad Khan) మరోసారి వివాదంలోకి దిగారు. ఆగ్నేయ ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
- By Gopichand Published Date - 09:10 AM, Fri - 6 January 23

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే (Ex-Congress MLA) ఆసిఫ్ మహ్మద్ ఖాన్ (Asif Mohammad Khan) మరోసారి వివాదంలోకి దిగారు. ఆగ్నేయ ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో పోలీసులతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆయనను గురువారం అరెస్ట్ చేశారు. వాహన చోరీ ఘటనకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నయీ బస్తీ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు స్కాన్ చేస్తున్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఇంతలో ఖాన్ అక్కడికి వచ్చి పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దింతో ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌పై షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 186, 353, 341, 153ఎ కింద కేసు నమోదు చేసి ఖాన్‌ను అరెస్టు చేశారు. అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు అధికారి తెలిపారు.
Also Read: CM KCR: సీఎం కేసీఆర్‌కు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు
ఆసిఫ్ మహ్మద్ ఖాన్ ఇంతకుముందు కూడా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు. గతేడాది నవంబర్ 25న షాహీన్‌బాగ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉండగా.. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేసి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ కేసులో కూడా ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చాలా రోజుల తర్వాత ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌కు కొన్ని షరతులపై బెయిల్ మంజూరు చేయబడిందని, ఈ షరతుల్లో దేనినైనా అతను ఉల్లంఘిస్తే, ప్రాసిక్యూషన్ అతని బెయిల్‌ను రద్దు చేయాలని కోరవచ్చని కోర్టు హెచ్చరించింది.