CM KCR: సీఎం కేసీఆర్‌కు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు
అఖిల భారతీయ రైతు సంఘం ప్రతి సంవత్సరం అందించే ప్రతిష్టాత్మక సర్ ఛోటూ రామ్ అవార్డు (Sir Chhotu Ram award)ను 2022 గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కు ప్రదానం చేశారు. కేసీఆర్ తరపున గురువారం ఈ అవార్డును వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అందుకున్నారు.
- By Gopichand Published Date - 08:10 AM, Fri - 6 January 23

అఖిల భారతీయ రైతు సంఘం ప్రతి సంవత్సరం అందించే ప్రతిష్టాత్మక సర్ ఛోటూ రామ్ అవార్డు (Sir Chhotu Ram award)ను 2022 గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కు ప్రదానం చేశారు. కేసీఆర్ తరపున గురువారం ఈ అవార్డును వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అందుకున్నారు. తెలంగాణలో రైతుల అభివృద్ధికి చేసిన కృషికి గాను 2022 సంవత్సరానికి గాను అఖిల భారత రైతు సంఘం అందించే ప్రతిష్టాత్మక సర్ ఛోటూ రామ్ అవార్డును ముఖ్యమంత్రి కెసిఆర్ వరించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలో రైతు సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం దేశంలోనే అత్యధిక ఉపాధిని కల్పిస్తోందని, అందుకోసం అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు లాభసాటిగా మారేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి సరికొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని ప్రపంచానికి ధాన్యాగారంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.
Also Read: Earthquake: పలుచోట్ల భూ ప్రకంపనలు.. వారం వ్యవధిలో ఢిల్లీలో రెండోసారి
“ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్‌లో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ, వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఈ రంగాలను అన్వేషించడంలో విఫలమయ్యాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటంలో మరణించిన 700 మందికి పైగా రైతులకు ఎటువంటి మద్దతు కూడా ఇవ్వలేదు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు అందించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు’’ అని అన్నారు. రైతు ప్రతినిధి బృందంలో అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడు, సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు సత్నామ్ సింగ్ బెహ్రూ, అసోసియేషన్ సలహాదారు సుఖ్వీందర్ సింగ్ కాకా, తదితరులు ఉన్నారు.