HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Ecs Key Decision Now Preparing For A Comprehensive Revision Of Voter Lists Across The Country

Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల సమగ్ర సవరణకు సన్నద్ధం!

బిహార్‌లో జరుగుతున్న విధంగా వచ్చే నెల నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా సమగ్ర సవరణ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. బిహార్‌లో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈ నెల 10న వాటిని విచారించి, ఈ ప్రక్రియను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని చెప్పింది.

  • By Latha Suma Published Date - 10:42 AM, Mon - 14 July 25
  • daily-hunt
EC's key decision.. Now the voters' list will be revised across the country..!!
EC's key decision.. Now the voters' list will be revised across the country..!!

Election Commission : బిహార్‌లో ఓటరు జాబితాలపై ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) చేపట్టే అధికారం భారత ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోందని సమాచారం. బిహార్‌లో జరుగుతున్న విధంగా వచ్చే నెల నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా సమగ్ర సవరణ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. బిహార్‌లో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈ నెల 10న వాటిని విచారించి, ఈ ప్రక్రియను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని చెప్పింది. అయితే, త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఇది అనువైన సమయం కాదని అభిప్రాయపడింది. అయినప్పటికీ, ఈ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Read Also: Ujjaini Mahankali Bonalu : వైభవంగా రంగం కార్యక్రమం..ఈ ఏడాది అమ్మవారు ఏం చెప్పారంటే..?

ఈ సవరణ కసరత్తు ద్వారా, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సమీక్షించి, వివాదాస్పద లేదా చెల్లని ఎంట్రీలను తొలగించాలన్నదే లక్ష్యం. ముఖ్యంగా విదేశీ అక్రమ వలసదారులు  బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాల నుండి వచ్చిన వారు ఓటర్ల జాబితాలో ఉండకూడదని ఈసీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్న దృష్ట్యా, ఈ ప్రక్రియకు ప్రాధాన్యం పెరిగింది. దేశంలోని చాలా రాష్ట్రాలు 2002 నుంచి 2004 మధ్య కాలంలో ఓటరు జాబితాలపై సమగ్ర సవరణ చేపట్టాయి. అయితే ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎలాంటి సవరణ జరగలేదు. ఉదాహరణకు, ఢిల్లీలో చివరిసారి 2008లో ఈ ప్రక్రియ నిర్వహించగా, ఆ జాబితా ప్రస్తుతం సీఈవో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఉత్తరాఖండ్‌లో 2006లో సవరణ జరగగా, ఆ రాష్ట్ర వెబ్‌సైట్‌లో ఆ జాబితా ఉంచారు. ఈ నేపథ్యంలో, తాజా సమగ్ర సవరణ దేశవ్యాప్తంగా ఓటరు సమాచారాన్ని శుద్ధి చేయడంలో సహాయపడనుంది.

ఈ ప్రక్రియలో ఓటర్ల గుర్తింపును నిర్ధారించేందుకు ఆధార్‌, రేషన్‌కార్డు, ఓటరు ఐడీ వంటి పత్రాలను పరిశీలించాలని ఈసీ సూచించబడింది. ఇవి తప్పనిసరిగా కాకపోయినా, ఓటర్ల గుర్తింపును ధృవీకరించడంలో ఉపయుక్తమవుతాయని భావిస్తున్నారు. బిహార్‌లో ఈ అంశంపై దాఖలైన పది పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 28న సుప్రీం కోర్టులో జరుగనుంది. ఆ విచారణ అనంతరం దేశవ్యాప్తంగా సమగ్ర సవరణ చేపట్టాలా లేదా అన్నదిపై ఈసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. దేశ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. అసత్యమైన ఎంట్రీలు, అక్రమంగా ఓటు హక్కు వినియోగం వంటి పరిస్థితుల నివారణకు ఓటరు జాబితాల సవరణ అత్యంత కీలకం. ఎన్నికల సంఘం చేపట్టబోయే ఈ దేశవ్యాప్త సమగ్ర సవరణతో, ఓటింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, న్యాయంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Shubhanshu Shukla : కాసేపట్లో భూమిపైకి శుభాంశు శుక్లా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • bihar
  • Election commission
  • Foreign illegal immigrants
  • myanmar
  • Special Intensive Revision
  • voter list

Related News

Mamata Tears Into Bjp

SIR : SIRకు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ

SIR : దేశవ్యాప్తంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) కార్యక్రమం రెండో దశ ప్రారంభమైన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీని వ్యతిరేకంగా మంగళవారం గట్టిగా నిరసన వ్యక్తం చేశారు

    Latest News

    • TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

    • Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

    • Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

    • Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

    • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

    Trending News

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

      • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd