Delhi Elections : 19.95 శాతం పోలింగ్ నమోదు
Delhi Elections : ఉదయం 07 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలుకాగా 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు
- By Sudheer Published Date - 12:17 PM, Wed - 5 February 25

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi Elections) ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 07 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలుకాగా 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల వద్ద క్యూ కట్టడం గమనార్హం. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో కీలక రాజకీయ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తన సతీమణితో కలిసి ఓటు వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Cow Dung : ఆవుపేడను కొనేందుకు ఈ దేశాల క్యూ.. ఎంత ధర ?
దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీలో ఈ ఎన్నిక జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారడం గమనార్హం. ఇక అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ముఖ్యంగా రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ప్రజలను కోరుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల అధికారులు, పోలీసు విభాగం శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఓటర్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో పార్టీల మధ్య తీవ్ర విమర్శలు జరిగినప్పటికీ, ప్రజలు ఎన్నికల ప్రక్రియలో ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఓటింగ్ ముగిసిన తర్వాత, ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.