HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Dalai Lamas First Original Hindi Biography Unveiled In Delhi

Dalai Lama: దలైలామా తొలి మూల హిందీ జీవిత కథ ఢిల్లీలో ఆవిష్కరణ!

హిందీ, ఇంగ్లిష్, తెలుగు పాత్రికేయరంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న అరవింద్‌ యాదవ్‌ ఈ గ్రంథ రచనలో ఏ విషయాన్ని అనుసరించడం గాని, అనువదించడం గాని జరగలేదని స్పష్టం చేశారు.

  • Author : Gopichand Date : 16-11-2025 - 4:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dalai Lama
Dalai Lama

Dalai Lama: పద్నాలుగో దలైలామా (Dalai Lama) జీవిత చరిత్రకు సంబంధించిన తొలి మూల హిందీ గ్రంథం ఢిల్లీలో ఆవిష్కరణతో సమకాలీన భారత సాహిత్యానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రఖ్యాత జర్నలిస్ట్, ప్రముఖుల జీవితకథల రచయిత డాక్టర్‌ అరవింద్‌ యాదవ్‌ రచించిన ఈ పుస్తకం న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో విడుదలైంది.

ప్రసిద్ధ రాజనీతజ్ఞుడు, రచయిత పద్మవిభూషణ్‌ డాక్టర్‌ కరణ్‌సింగ్‌ దలైలామా జీవిత చరిత్రను ఆవిష్కరించారు. ఈ కొత్త పుస్తకం తొలి ప్రతిని పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మురళీమనోహర్‌ జోషీకి అందజేశారు. ఢిల్లీ టిబెట్‌ హౌస్‌ డైరెక్టర్‌ గెషే దోర్జీ దందూల్‌ కూడా దలైలామా అధికార ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మానవ విలువలపై దలైలామా సందేశం విశ్వవ్యాప్తం: డా. కరణ్ సింగ్

సభకు అధ్యక్షత వహించిన డా. కరణ్‌సింగ్‌ మాట్లాడుతూ.. దలైలామా జీవితం, బోధనలను కళ్లకు కట్టే ఈ గ్రంథం భారత సాహిత్యానికి గొప్ప సంపద అని పేర్కొన్నారు. “దలైలామా జీవితం ఒక ఆధ్యాత్మిక నాయకుని జీవనయానాన్ని మాత్రమే చెప్పదు. శాంతి, కరుణ, మానవ విలువలకు సంబంధించి ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది” అని ఆయన తెలిపారు.

డా. సింగ్.. దలైలామాతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ 1956లో ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తమను పరిచయం చేశారని, అప్పటి నుండి తాము మంచి స్నేహితులుగా ఉన్నామని అన్నారు. ఈ గ్రంథ రచనలో డా. అరవింద్‌ యాదవ్‌ విశేష కృషిని ఆయన ప్రశంసించారు. “దలైలామా జీవిత చరిత్ర మొత్తాన్ని హిందీలో రాయడం ద్వారా డా. యాదవ్‌ గొప్ప సాహసాన్ని ప్రదర్శించారు. ఈ పుస్తకాన్ని అన్ని హిందీ గ్రంథాలయాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను” అని డా. సింగ్ ఆకాంక్షించారు.

Also Read: Laddu: అధిక కొలెస్ట్రాల్ ఉన్న‌వారు ఈ ల‌డ్డూలు తినొచ్చు?!

సాధారణంగా కనిపించే దలైలామా గొప్ప బోధనలతో ప్రభావితం: డా. జోషి

దలైలామా ఆధ్యాత్మిక తత్వం, ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభావంపై డా. మురళీమనోహర్‌ జోషీ మాట్లాడారు. పైకి సాధారణంగా కనిపించే దలైలామా తన ఘనమైన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు, ఆలోచనాపరులు, యువతపై ఎంత గొప్ప ప్రభావం చూపారో వివరించారు. ఈ కొత్త జీవితకథ “భవిష్యత్‌ తరాలకు ఎంతో విలువైన మూల సంపద” అని డా. జోషీ అభివర్ణించారు.

చైనా దాష్టీకంపై విమర్శలు

టిబెట్‌ ఎదుర్కొన్న రాజకీయ, సాంస్కృతిక సవాళ్ల గురించి డా. జోషీ ప్రస్తావిస్తూ.. చైనా అనుసరిస్తున్న దుందుడుకు విధానాలు దలైలామాను మాతృభూమిని విడిచిపోయేలా చేశాయన్నారు. “చైనా దాష్టీకాల వల్ల టిబెట్‌ ప్రజలు తమ మాతృభూమిని వదిలి ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం పొంది జీవించాల్సివస్తోంది. అయినప్పటికీ టిబెట్‌ తమ పోరాటంలో విజయం సాధిస్తారనే నమ్మకం నాకు ఉన్నది” అని డా. జోషీ పేర్కొన్నారు.

హిందీ, ఇంగ్లిష్, తెలుగు పాత్రికేయరంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న అరవింద్‌ యాదవ్‌ ఈ గ్రంథ రచనలో ఏ విషయాన్ని అనుసరించడం గాని, అనువదించడం గాని జరగలేదని స్పష్టం చేశారు. దలైలామా, టిబెట్‌ బౌద్ధానికి సంబంధించిన అనేక మూలాలు, చారిత్రక రికార్డులు, సొంత అనుభవాలు తెలుసుకుని ఆయన ఈ జీవితకథ రచించారు. ఈ పుస్తకంలో దలైలామా జీవితం, టిబెట్‌ ఆధునిక చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు మొదటిసారి వెల్లడి అవుతున్నాయి. ఇది కేవలం సాహిత్య విజయం మాత్రమే కాదు. టిబెట్‌ బౌద్ధం, సమకాలీన ప్రపంచ చరిత్రకు సంబంధించిన విశేష సాక్ష్యాధార పత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Biography
  • Dalai Lama
  • Dalai Lama News
  • delhi
  • india
  • national news

Related News

Fake Voters

ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!

ఎన్నికల కమిషన్ జారీ చేసిన 14 అంశాల మార్గదర్శకాల ప్రకారం.. ముసుగు ధరించిన మహిళలను గుర్తించడానికి ప్రిసైడింగ్ అధికారులు స్థానిక మహిళా ఉద్యోగుల సహాయం తీసుకోవచ్చు.

  • India- Pakistan

    2026లో కూడా భారత్- పాకిస్థాన్ మ‌ధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!

  • What is special about red rice? How to use red rice in food?

    ఎర్రబియ్యం ప్రత్యేకత ఏమిటి?..ఆహారంలో ఎర్రబియ్యం ఎలా ఉపయోగించాలి?

  • PM Modi

    లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

  • Prime Minister Modi participates in Christmas celebrations

    క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది: ప్రధాని మోడీ

Latest News

  • క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన బౌల‌ర్‌!

  • రూ. లక్ష డిపాజిట్‌పై రూ. 20,983 వడ్డీ.. ఏ బ్యాంక్‌లో అంటే?!

  • తైవాన్‌లో భారీ భూకంపం.. 7.0 తీవ్రతతో వణికిన రాజధాని!

  • 35 ఏళ్లు దాటాయా? మీ శారీరక సామర్థ్యం తగ్గే సమయం ఇదే!

  • టాలీవుడ్‌లో రోషన్ జోరు.. క్రేజీ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు!

Trending News

    • న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్‌డేట్స్ ఇవే!

    • అంపైర్ల జీతాల పెంపు నిర్ణయం వాయిదా వేసిన బీసీసీఐ!

    • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

    • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

    • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd