Congress Manifesto : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో.. నిరుద్యోగులు, మహిళలకు కీలక హామీలు
కాంగ్రెస్ మేనిఫెస్టో(Congress Manifesto)లో ప్రధానంగా 22 అంశాలపై ఫోకస్ చేశారు.
- By Pasha Published Date - 02:25 PM, Wed - 29 January 25

Congress Manifesto : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఇవాళ (బుధవారం) రిలీజ్ చేసింది. ప్రధాన ప్రత్యర్ధులు బీజేపీ, ఆప్‌లకు ధీటుగా పలు కీలక హామీలు ఇచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, పార్టీ కమ్యూనికేషన్ ఇంఛార్జి జైరాం రమేశ్‌లు మేనిఫెస్టోను విడుదల చేశారు. వివరాలివీ..
Also Read :Maha Kumbh Stampede : డస్ట్ బిన్స్ వల్లే తొక్కిసలాట.. మహాకుంభ మేళాలోని ప్రత్యక్ష సాక్షులు
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీలివీ..
- కాంగ్రెస్ మేనిఫెస్టో(Congress Manifesto)లో ప్రధానంగా 22 అంశాలపై ఫోకస్ చేశారు.
- ఢిల్లీలో కులగణన నిర్వహణ
- ఢిల్లీలోని పూర్వాంచల్ ప్రాంత వాసుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు
- మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థికసాయం
- ఢిల్లీవాసులకు ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్
- రూ.500కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ
- రూ.25 లక్షల దాకా ఉచిత ఆరోగ్య బీమా
- ప్రజలకు ప్రతినెలా ఉచిత రేషన్ కిట్ల పంపిణీ
- ఢిల్లీలోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఏడాది పాటు ప్రతినెలా రూ.8,500 ఆర్థిక సాయం
- ఢిల్లీ పరిధిలో 100 ‘ఇందిర క్యాంటీన్ల’ ఏర్పాటు. పేదలకు రూ.5కే భోజన వసతి
Also Read :Trump Buyouts Offer : 8 నెలల శాలరీ ఇస్తా.. జాబ్ వదిలేయండి.. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ ఆఫర్
- కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ రద్దు. జాబ్స్‌లో ఉన్న వారందరి ఉద్యోగాలు పర్మినెంట్.
- ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
- వృద్ధుల నెలవారీ పింఛను రూ.2,500 నుంచి రూ.5వేలకు పెంపు
- వితంతువుల పిల్లల వివాహాలకు రూ.1.1 లక్షల ఆర్థిక సాయం
- దిల్లీలో వీధి వ్యాపారాలు చేసుకునే 7.5 లక్షల మందికి మరింత మెరుగైన అవకాశాల కల్పన. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి తోడ్పాటు.
- దిల్లీలోని ప్రతీ వార్డులో 24 గంటలూ అందుబాటులో ఉండేలా వైద్య డిస్పెన్సరీల ఏర్పాటు. దిల్లీవాసులకు మెరుగైన వైద్యసదుపాయాల కల్పన.
- విద్యార్థుల కోసం దిల్లీలో 700 ప్రజా గ్రంథాలయాల ఏర్పాటు. పోటీ పరీక్షలు రాసే యువతకు ఉపయోగపడేలా మెటీరియల్ అందుబాటులోకి.