HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Congress Leaders Sharing Sweets

Election Results 2024 : అప్పుడే స్వీట్స్ పంచుకుంటున్న కాంగ్రెస్ నేతలు

Election Results 2024 : హరియాణా, జమ్మూకశ్మీర్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు

  • Author : Sudheer Date : 08-10-2024 - 10:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Leaders Sharing Sw
Congress Leaders Sharing Sw

హరియాణా (Haryana), జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో వెలువడనున్నాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైంది. హరియాణాలో కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించనుందని.. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని కూడా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఆ అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వెల్లడవుతూ వస్తున్నాయి. కొద్దీ సేపటి వరకు హర్యానా లో కాంగ్రెస్ లీడ్ కనిపించగా..ప్రస్తుతం బిజెపి లీడ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది.

ఇక హరియాణా, జమ్మూకశ్మీర్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని AICC ఆఫీస్ వద్ద లడ్డూలు, జిలేబీలు పంచుకుంటూ.. ఆనందంతో ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. పెద్ద ఎత్తున బాణసంచాను సిద్ధం చేస్తున్నారు. హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో 90 స్థానాలకు పోలింగ్ జరుగగా.. 67.9 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ (బీజేపీ), కాంగ్రెస్ మధ్య పోటి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్‌ ఫిగర్ 46 సీట్లు రావాలి. కాగా, హ్యాట్రిక్‌ విజయం తమదేనని బీజేపీ నేతల ధీమా వ్యక్తం చేస్తుంటే..ఈసారి తమదే విజయమని కాంగ్రెస్ చెపుతుంది. ప్రస్తుతం ఇక్కడ 44 స్థానాల్లో బిజెపి ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 37 చోట్ల, ఇతరులు 9 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు.

ఇక జమ్మూ విషయానికి వస్తే.. ఇక్కడ 90 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 63.45 శాతం పోలింగ్ నమోదైంది. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు కావడం వల్ల జమ్ముకశ్మీర్​ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్‌సీ కలిసి పోటీ చేశాయి. ప్రస్తుతం ఇక్కడ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లీడ్ లో ఉంది.

Read Also : Afzal Gurus Brother: ఎన్నికల బరిలో అఫ్జల్ గురు సోదరుడు.. భవితవ్యం తేలేది నేడే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • Congress leaders sharing sweets
  • haryana
  • jammu kashmir
  • jammu kashmir haryana result

Related News

We won't tolerate any interference regarding Kashmir: India's strong counter to Pakistan at the UN.

Anupama Singh: కాశ్మీర్ జోలికొస్తే ఊరుకోం.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్ ప్రతినిధికి భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్‌ గట్టి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడం, వారిని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగించడం పాక్‌కు అలవాటైందని ఆరోపించారు. ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వార్షిక నివే

    Latest News

    • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

    • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

    • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

    • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

    • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd