Bengaluru: బెంగళూరులో దారుణ ఘటన.. కండక్టర్ సజీవ దహనం
లింగధీరనహళ్లిలోని బెంగళూరు (Bengaluru) మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో 45 ఏళ్ల బస్సు కండక్టర్ మృతి చెందాడు.
- By Gopichand Published Date - 02:23 PM, Fri - 10 March 23

బెంగళూరు (Bengaluru) మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ఓ కండక్టర్ సజీవ దహనమయ్యారు. లింగధీరనహళ్లిలోని బెంగళూరు (Bengaluru) మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో 45 ఏళ్ల బస్సు కండక్టర్ మృతి చెందాడు. ఈ ఘటనపై శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ముత్తయ్య స్వామిగా గుర్తించారు. డీసీపీ లక్ష్మణ్ బి నింబర్గి తెలిపిన వివరాల ప్రకారం.. సుమనహళ్లి బస్ డిపో వద్ద బీఎంటీసీ బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో బస్సు డ్రైవర్ ప్రకాష్ ఈ ఘటనను ముందుగా గమనించాడు.
గురువారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో డి గ్రూప్ స్టాప్‌లో డ్రైవర్ ప్రకాష్ వాహనాన్ని పార్క్ చేసి బస్టాప్‌లో నిద్రించడానికి వెళ్లాడని, కండక్టర్ బస్సులోనే పడుకున్నాడని డిసిపి లక్ష్మణ్ తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో కండక్టర్‌కు 80 శాతం కాలిన గాయాలయ్యాయని డీసీపీ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: 36 Students Hospitalised: ఫుడ్ పాయిజన్ తో 36 మంది విద్యార్థినులకు అస్వస్థత
మరోవైపు.. శుక్రవారం తెల్లవారుజామున బైటరాయణపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమోద్ లేఅవుట్ ప్రాంతంలో ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర స్క్రాప్ నిల్వ ఉంచే స్థలంలో మరోసారి మంటలు చెలరేగాయని డీసీపీ లక్ష్మణ్ తెలిపారు. మంటలను ఆర్పేందుకు మొత్తం ఎనిమిది ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయని డీసీపీ తెలిపారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇతర ప్రాణనష్టం గురించి ఎటువంటి నివేదిక లేదు.

Related News

Accident: బెంగళూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
బెంగళూరు నగరంలోని మడివాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident)లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ వాసులు. వేగంగా వెళ్తున్న కారు సిల్క్‌బోర్డ్ కూడలి వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న తమిళనాడు బస్సును ఢీకొట్టింది.