Mamata Banerjee : మమతా బెనర్జీ లేఖకు కేంద్రం ప్రత్యుత్తరం
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి మమతా బెనర్జీకి ప్రత్యుత్తరం పంపారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఇండియన్ జస్టిస్ కోడ్లో మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు ఉన్నాయని అన్నపూర్ణా దేవి లేఖలో వివరించారు.
- Author : Latha Suma
Date : 26-08-2024 - 7:32 IST
Published By : Hashtagu Telugu Desk
Mamata Banerjee: అత్యాచార కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ..ఇటివల సీఎం మమత బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖ పై కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి మమతా బెనర్జీకి ప్రత్యుత్తరం పంపారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఇండియన్ జస్టిస్ కోడ్లో మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు ఉన్నాయని అన్నపూర్ణా దేవి లేఖలో వివరించారు. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం విషయంలో, పోక్సో కేసులను త్వరగా పరిష్కరించేందుకు అక్టోబర్ 2019లో ప్లాన్ ప్రారంభించినట్లు లేఖలో ప్రస్తావించారు.
We’re now on WhatsApp. Click to Join.
30 జూన్ 2024 నాటికి, దేశవ్యాప్తంగా 752 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేస్తున్నాయని.. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్కు 20 పోక్సో కోర్టులతో సహా 123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేటాయించామని లేఖలో స్పష్టం చేశారు. కానీ 2023 జూన్ మధ్య వరకు, పశ్చిమ బెంగాల్లో వీటిలో ఒక్క కోర్టు కూడా పని చేయడం లేదు. తరువాత, సవరించిన చట్టాల ప్రకారం, బెంగాల్కు 17 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేటాయించబడ్డాయి. ఇందులో జూన్ 30 వరకు కేవలం 6 పోక్సో కోర్టులు మాత్రమే పని చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో 48,600 అత్యాచారలాతో పాటు పోక్సో కేసులు పెండింగ్లో ఉన్నాయి.
మిగిలిన 11 ఫాస్ట్ట్రాక్ కోర్టులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళలపై హింస, నేరాలను నిరోధించే సామర్థ్యం ఉన్న చట్టపరమైన ఫ్రేమ్వర్క్ మమహిళల భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చట్టపరమైన స్కీమ్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పశ్చిమ బెంగాల్లోని మహిళలు, బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలి అని మమతా బెనర్జీకి సమాధానం ఇచ్చారు.