Union Budget 2023: ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే..!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 2023-24 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ (Union Budget 2023)ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించారు.
- Author : Gopichand
Date : 01-02-2023 - 1:28 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 2023-24 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ (Union Budget 2023)ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించారు. పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామాన్ మాట్లాడుతూ.. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని.. ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందని అన్నారు.
పర్యావరణహిత చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్టు నిర్మల తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం పెంచారు.
ధరలు పెరిగేవి ఇవే
టైర్లు
సిగరెట్లు
బంగారం, వెండి
వజ్రాలు
బ్రాండెడ్ దుస్తులు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు
ధరలు తగ్గేవి ఇవే
ఎలక్ట్రిక్ వాహనాలు
టీవీలు, మొబైల్ ఫోన్లు
కిచెన్ చిమ్నీలు
లిథియం అయాన్ బ్యాటరీలు
కెమెరాలు
లెన్సులు