HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Another Gold Mine Discovered 222 Tons Of Gold

Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!

  • Author : Vamsi Chowdary Korata Date : 25-10-2025 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Mine
Gold Mine

దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. గతంలో గుర్తించిన భుకియా, జగ్పురా గనుల తర్వాత ఈ ప్రాంతం మూడో బంగారు గనిగా నిలిచింది.

భూగర్భ శాస్త్రవేత్తల సర్వేల ప్రకారం.. ఈ కొత్త గనిలో సుమారు 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ కొత్త బంగారు నిల్వల్లో అత్యంత భారీగా పసిడి లభించబోతున్నట్లు భూగర్భ శాఖ ప్రాథమిక అంచనాల చెబుతున్నాయి. 940.26 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 113.52 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఖనిజాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత సుమారు 222.39 టన్నుల స్వచ్ఛమైన బంగారు లోహం లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్లో ఇప్పటివరకు బయటపడిన అతిపెద్ద బంగారు నిల్వల్లో ఇది ఒకటని పేర్కొంటున్నారు.

కంకారియా-గారా ప్రాంతంలో బంగారంతో పాటు అనేక విలువైన ఖనిజాలు కూడా వెలికితీసే అవకాశం ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్ని అనుమతులు వచ్చి.. అక్కడ బంగారం మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమైతే.. భారతదేశంలో బంగారం తవ్వకాల్లో పాల్గొనే అతి కొద్ది రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ చేరుతుంది. అంతేకాకుండా.. నిపుణుల అంచనా ప్రకారం భవిష్యత్తులో దేశానికి కావాల్సిన మొత్తం బంగారం డిమాండ్లో 25 శాతం వరకు బాన్స్వారా జిల్లా నుంచే సరఫరా అవుతుందని చెబుతున్నారు.

గతంలో భుకియా-జగ్పురా మైనింగ్ బ్లాక్లను ప్రభుత్వం వేలం వేసినప్పటికీ.. విజేత సంస్థ అవసరమైన హామీ మొత్తాన్ని జమ చేయడంలో విఫలం కావడంతో లైసెన్స్ రద్దు చేశారు. ప్రస్తుతం తాజా టెండర్ల ప్రక్రియ పూర్తయింది. నవంబర్ 3వ తేదీన బిడ్లు తెరవనున్నారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక రెవెన్యూ వాటాను అందించే సంస్థకు మైనింగ్ లైసెన్స్ మంజూరు చేయనున్నారు.

ఈ బంగారు నిల్వలు బయటపడటంతో బాన్స్వారా జిల్లాలో భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, పెట్రోకెమికల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి.. రాజస్థాన్లో ఒక కీలక పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా జిల్లాను మారుస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 100 Ton Gold
  • 2025 gold update
  • 22 carat Gold
  • india
  • Kankariya Village
  • rajasthan

Related News

Cng Gas

CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర

    Latest News

    • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

    • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

    • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

    • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

    • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd