Delhi Murder Case: ఢిల్లీలో మరో దారుణం.. భర్తను 22 ముక్కలుగా నరికి, ఫ్రిజ్ లో దాచి!
దేశ రాజధానిలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, చోరీలు, రేప్ కేసులు ఢిల్లీని వణికిస్తున్నాయి.
- Author : Balu J
Date : 28-11-2022 - 1:20 IST
Published By : Hashtagu Telugu Desk
దేశ రాజధాని ఢిల్లిలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, చోరీలు, వివాహేతర సంబంధాలు ఢిల్లీని వణికిస్తున్నాయి. ఇప్పటికే శ్రద్దా వాకర్ కేసు సంచలనం కలిగిస్తున్న నేపథ్యంలో తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. భర్తకు తోడుగా ఉండాల్సిన భార్య అతన్ని కిరాతకంగా హత్య చేసింది. భర్తను హత్య చేయడమే కాకుండా, మృతదేహాన్ని 22 ముక్కలుగా నరికి ఢిల్లీలోని తూర్పు ప్రాంతంలోని ఓ నిర్జీవ ప్రదేశంలో పడేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ మహిళను, ఆమె కొడుకును అరెస్టు చేశారు..
ఢిల్లీలోని త్రిలోక్‌పురిలోని తన ఇంట్లో భర్త అంజన్‌దాస్‌ను హత్య చేసినందుకు పూనమ్, దీపక్ దాస్‌లను అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులు మీడియాకు తెలిపారు. భార్య, ఆమె కొడుకు ముక్కలుముక్కలుగా నరికి ఫ్రిజ్ లో ఉంచి, ఆ తర్వాత ముక్కలను పలు చోట్ల పారేస్తుండటం సీసీ కెమెరాకు చిక్కాయి. అక్రమ సంబంధం కారణంగా భార్య భర్తను హత్యచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే శ్రద్ధా వాకర్ కేసు ఢిల్లీని భయపెడుతండగా, తాజాగా ఈ ఉదంతం ఉలిక్కి పడేలా చేసింది. ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఫ్రిజ్ లో పెట్టి, ఆముక్కలను బయటపడేయడం తెలిసిందే. ఈ రెండు వరుస ఘటనలతో ఢిల్లీ మరోసారి వార్తల్లోకెక్కింది.
Pandav Nagar murder | Delhi: Visuals of the residence of the accused where they kept the chopped-off body pieces of the victim in the refrigerator. https://t.co/qRSsepJPzq pic.twitter.com/UVNalvLdT9
— ANI (@ANI) November 28, 2022