Africa : భారత్‌కు రానున్న మరో 8 చిరుతలు
మేలో నాలుగు ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భోపాల్‌లో జరిగిన చిరుత ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో ఎన్‌టీసీఏ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు.
- By Latha Suma Published Date - 01:22 PM, Sat - 19 April 25

Africa : కేంద్ర ప్రభుత్వం దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆఫ్రికా నుంచి ఈసారి ఎనిమిది చీతాలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. మేలో నాలుగు ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భోపాల్‌లో జరిగిన చిరుత ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో ఎన్‌టీసీఏ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు.
రాజస్థాన్ మధ్య అంతర్-రాష్ట్ర చిరుత సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటుచేయడానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. ఇంతకు ముందు తీసుకువచ్చిన చిరుత పునరావాసానికి వెళ్ళిందని తెలిపారు. ప్రాజెక్టు చీతా కింద చిరుతలను రాజస్థాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి దశలవారీగా తరలించనున్నట్లు ఎన్‌టీసీఏ అధికారులు చెప్పారు. ఆఫ్రికా నుంచి చిరుతలను తీసుకురావడం ఇది రెండోసారి.
కాగా, కేంద్రం 2022, సెప్టెంబర్ 17న ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకొచ్చింది. అందులో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు వచ్చాయి. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పలు చిరుతలు మృతి చెందాయి. ప్రస్తుతం కూనో పార్క్‌లో 26 చిరుతలు ఉన్నాయి. వాటిలో 14 భారత్‌లో జన్మించిన కూన పిల్లలు. వీటన్నింటినీ మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలారు. ఇక, కాగా, ప్రపంచంలోని 7 వేల చిరుతల్లో అధికంగా దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానాలో నివసిస్తున్నాయి. అయితే నమీబియాలోనే చీతాలు అత్యధికంగా ఉన్నాయి.
Read Also: GVMC Mayor Seat: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి!