Eye Stroke: కంటి స్ట్రోక్ ఎందుకు వస్తుంది? లక్షణాలు, చికిత్స ఏమిటి?
అందరికీ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ గురించే తెలుసు, కానీ కంటికి కూడా స్ట్రోక్ వస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు.
- By Maheswara Rao Nadella Published Date - 10:00 AM, Sun - 19 March 23

హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ప్రాణానికే ప్రమాదం. అదే కంటి స్ట్రోక్ (Eye Stroke) వస్తే చూపు మొత్తం పోయే అవకాశం ఎక్కువ. కంటి స్ట్రోక్‌ను కంటి పక్షవాతం గా కూడా చెప్పుకోవచ్చు. ఇది కంటిలోని ఆప్టిక్ నరాలలోకి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల వచ్చే ఒక సమస్య. ఈ కంటి స్ట్రోక్ వస్తే ఆకస్మికంగా కంటి చూపు పోతుంది. అంతవరకు కనిపించిన కళ్ళు అకస్మాత్తుగా దృష్టిని కోల్పోతాయి. ఇది ఆ మనిషిని నిలువునా కుంగదీసేస్తుంది. ఏం జరిగిందో తెలియక భయంతో ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఒకే కంటికి..
కంటి స్ట్రోక్ (Eye Stroke) వచ్చే ముందు చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. కానీ అవగాహన తక్కువ కాబట్టి చాలా మందికి దీని గురించి తెలిసే అవకాశం ఉండదు. కళ్ళలోని చిన్న రక్తనాళాలు దెబ్బ తినడం ద్వారా మొదటి లక్షణం కనిపిస్తుంది. అస్పష్టంగా కనిపించడం, చూపులో చీకటి ప్రాంతాలు లేదా నీడ లాంటివి కనిపించడం జరుగుతుంది. వైద్యులు చెబుతున్న ప్రకారం రెండు కళ్ళకు కంటి స్ట్రోక్ ఒకేసారి వచ్చే అవకాశం తక్కువే, ఒక కంటికి మొదట కంటి స్ట్రోక్ వస్తుంది. అప్పుడు వెంటనే చికిత్స తీసుకుంటే రెండో కంటికి రాకుండా కాపాడుకోవచ్చు. రెండు కళ్ళకు ఒకేసారి కంటి స్ట్రోకు వస్తే మాత్రం శాశ్వతంగా చూపు కోల్పోతారు.
ఎందుకు వస్తుంది?
ముందే చెప్పినట్టుగా కంటిలోని రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగా లేకపోయినా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆప్టిక్ నాడి అనేది మెదడును, కంటిని అనుసంధానించే ఒక నరం. దీనిలో మిలియన్ల కొద్ది నరాల ఫైబర్లు ఉంటాయి. ఈ ఆప్టిక్ నాడి దెబ్బతింటే కంటి స్ట్రోక్ అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి ఈ కంటి పక్షవాతం రక్తనాళాల్లో అడ్డంకులు లేకపోయినా కూడా కణజాలాలు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు కూడా వస్తుంది. ఆప్టిక్ నరాలకు పోషకాలు, రక్,తం ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినా… ఈ స్థితి వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు ఎలా ఉంటాయంటే..
నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ చెబుతున్న ప్రకారం 50 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ఈ కంటి స్ట్రోకు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్నవారికి కూడా ఇది వచ్చే ఛాన్సులు ఉన్నాయి. గ్లాకోమా వంటి కంటి సమస్యలతో బాధపడే వారు కూడా కంటి స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది.
చికిత్స ఇలా..
నిపుణుల అభిప్రాయం ప్రకారం కంటి స్ట్రోక్ చికిత్స అనేది స్ట్రోక్ వల్ల కన్ను ఎంత నష్టపోయింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నష్టం తక్కువగా ఉంటే కంటి ప్రాంతాన్ని మసాజ్ చేయడం వంటివి చేస్తారు. లేజర్ చికిత్స అందిస్తారు.
Also Read: Fire Accident: హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మరో భారీ అగ్నిప్రమాదం

Related News

Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?
సాధారణంగా వెండి,బంగారం,వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. వజ్రాల కంటే వెండి