ఆరోగ్యకరమైన నిద్రకు ఏ వైపు తిరిగి పడుకోవాలి?
గుండె జబ్బులు ఉన్నవారు లేదా గతంలో గుండెపోటు వచ్చిన వారు ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు.
- Author : Gopichand
Date : 28-12-2025 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
Sleep: ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర చాలా అవసరం. రాత్రిపూట 7-8 గంటల పాటు హాయిగా నిద్రపోయే వారు, నిద్రలేమితో బాధపడేవారి కంటే మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అయితే మీరు ఏ వైపు తిరిగి పడుకుంటున్నారు అనేది కూడా మీ నిద్ర నాణ్యతను, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆయుర్వేదంలో నిద్రించే భంగిమకు చాలా ప్రాముఖ్యత ఉంది. నిద్రపోయేటప్పుడు తల తూర్పు లేదా దక్షిణ దిశలో.. కాళ్లు ఉత్తర లేదా పడమర దిశలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కుడి వైపు లేదా ఎడమ వైపు.. ఏ వైపు తిరిగి పడుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
నిద్రించడానికి ఉత్తమమైన వైపు ఏది?
ఆయుర్వేదం ప్రకారం కుడి వైపు తిరిగి పడుకోవడం చాలా మంచిదని పరిగణించబడుతుంది. చాలామంది రాత్రంతా అటు ఇటు మారుతూ ఉన్నప్పటికీ వీలైనంత వరకు ఎడమ వైపు తిరిగి పడుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల వెన్నెముక దృఢంగా మారుతుంది. అలాగే సరైన దిండు, పరుపును ఉపయోగించడం ముఖ్యం. గర్భిణీలు, గుండెల్లో మంట, భుజం నొప్పి లేదా గుండె జబ్బులు ఉన్నవారికి ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉండవచ్చు.
Also Read: వైరల్ అవుతున్న చరణ్, ధోని, సల్మాన్ ఫోటో ఇదే!
గర్భధారణ సమయంలో ఏ వైపు తిరిగి పడుకోవాలి?
సాధారణంగా గర్భధారణ సమయంలో ఎడమ వైపు తిరిగి పడుకోవాలని నిపుణులు సూచిస్తారు. గర్భం పెరిగే కొద్దీ ఎడమ వైపు పడుకోవడం వల్ల పిండానికి (శిశువుకు) రక్త ప్రసరణ సరిగ్గా జరిగి, ఎదుగుదలకు సహాయపడుతుంది. అప్పుడప్పుడు కుడి వైపు పడుకోవడం పర్వాలేదు కానీ, గర్భధారణ రెండో, మూడో త్రైమాసికంలో వెల్లకిలా (వీపుపై) పడుకోకుండా ఉండటం మంచిది.
గుండెల్లో మంట ఉన్నప్పుడు ఏ వైపు పడుకోవాలి?
గుండెల్లో మంట లేదా ఎసిడిటీతో బాధపడేవారు తల వైపు కొంచెం ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు తగ్గి ఉపశమనం కలుగుతుంది.
గుండె రోగులు ఏ వైపు తిరిగి పడుకోవాలి?
గుండె జబ్బులు ఉన్నవారు లేదా గతంలో గుండెపోటు వచ్చిన వారు ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. అటువంటి వారికి కుడి వైపు తిరిగి పడుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కాబట్టి గుండె రోగులు కుడి వైపు తిరిగి పడుకోవడమే శ్రేయస్కరం.