ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.
- Author : Gopi
Date : 05-04-2026 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Coconut Water: మనం ఉదయం నిద్రలేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగడానికి ఇష్టపడతారు. కానీ ఒక సాధారణ సహజ పానీయం మీ దినచర్యనే మార్చేస్తుందని మీకు తెలుసా? ఈ రోజుల్లో చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగుతున్నారు. అసలు ఇలా తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటి? రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం స్వల్పంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి ఉదయాన్నే శరీరానికి సరైన పోషణ, హైడ్రేషన్ అవసరం. అటువంటి సమయంలో కొబ్బరి నీళ్లు ఒక అద్భుతమైన ఎంపిక.
ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే కలిగే మార్పులు
శరీరానికి అవసరమైన మినరల్స్ అందుతాయి
కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలసట లేదా బలహీనత తగ్గుతుంది. రోజంతా ఉత్సాహంగా, ఫ్రెష్‌గా ఉండాలనుకునే వారికి ఇది ఒక గొప్ప స్టార్టర్.
Also Read: తెలంగాణలో 1,242 వాణిజ్య దుకాణాలు వేలం.. ఎప్పుడంటే?
కడుపు సమస్యల నుండి ఉపశమనం
ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడదు. పైగా అది నెమ్మదిగా యాక్టివ్ అవుతుంది. కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపుకు సంబంధించిన ఈ క్రింది సమస్యల్లో మార్పు కనిపిస్తుంది.
- కడుపు ఉబ్బరం తగ్గడం.
- మలబద్ధకం నుండి ఉపశమనం, సాఫీగా విరేచనం అవ్వడం.
- ఎసిడిటీ, కడుపులో మంట తగ్గడం.
- ప్రేగులలో తేమను కాపాడటం.
- దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు తేలికగా అనిపిస్తుంది.
చర్మం, బరువు నియంత్రణకు మేలు
కొబ్బరి నీళ్లు శరీరంలో పోషకాలు, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయ. దీని ప్రభావం మీ చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా, కాంతివంతంగా మారుతుంది. అలాగే పెదవుల డ్రైనేస్ కూడా తగ్గుతుంది. ఇది నేరుగా బరువును తగ్గించకపోయినా తీపి పదార్థాలపై ఉండే కోరికను తగ్గించి, ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు సమతుల్యతలో సహాయపడుతుంది.