Monkey Caps: మంకీ క్యాప్ పెట్టుకుని నిద్రపోతున్నారా? అయితే సమస్యలే!
రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో నిద్రకు సౌకర్యవంతమైన, నిశ్శబ్ద వాతావరణం అవసరం. తద్వారా తగినన్నీ గంటలు నిద్రపోవచ్చు. అయితే పడుకునే సమయంలో మీరు మీ తలపై టోపీని ఉంచి నిద్రపోతే మీ శరీరం ఒక రకమైన గందరగోళంలో ఉంటుంది.
- By Gopichand Published Date - 06:45 AM, Sun - 22 December 24

Monkey Caps: శీతాకాలంలో ప్రజలు చల్లని గాలుల నుండి తమను తాము రక్షించుకోవడానికి వెచ్చని బట్టలు ధరిస్తారు. ఉన్ని బట్టలు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అయితే వాతావరణం చల్లగా ఉంటే ప్రజలు వెచ్చని బట్టలు ధరిస్తారు. అయితే రాత్రిపూట కూడా వాటిని ధరించి పడుకోవాలా? అనేది ప్రశ్న. పెద్దలు, పిల్లలను రాత్రిపూట మంకీ క్యాప్‌లు (Monkey Caps) ధరించి నిద్రపోతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఇది ఆరోగ్య పరంగా అస్సలు మంచిది కాదు. ఇలా మంకీ క్యాప్‌లు పెట్టుకుని పడుకుంటే సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మంకీ క్యాప్ ధరించి నిద్రపోవడం ప్రమాదకరం?
రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో నిద్రకు సౌకర్యవంతమైన, నిశ్శబ్ద వాతావరణం అవసరం. తద్వారా తగినన్నీ గంటలు నిద్రపోవచ్చు. అయితే పడుకునే సమయంలో మీరు మీ తలపై టోపీని ఉంచి నిద్రపోతే మీ శరీరం ఒక రకమైన గందరగోళంలో ఉంటుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
Also Read: Kohli Crying: గదిలో ఏడుస్తూ కూర్చున్న కోహ్లీ.. సీక్రెట్ రీవీల్ చేసిన అనుష్క
టోపీ పెట్టుకుని నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు
టోపీ-హెడ్ సిండ్రోమ్- మీరు చాలా గట్టిగా టోపీని ధరిస్తే అది తలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది తలనొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
చెమటలు పట్టడం- రాత్రిపూట టోపీ ధరించి నిద్రపోవడం వల్ల చెమట పట్టడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. చర్మ వ్యాధులకు కారణమవుతుంది.
జుట్టు బిగుతుగా ఉండటం- మీరు చాలా సేపు టోపీ ధరించి నిద్రపోతే అది జుట్టు, వాటి మూలాలను బిగుతుగా చేస్తేంది. దీని వలన జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. పొడిగా లేదా బలహీనంగా మారుతుంది.
హై బీపీ- రాత్రి పూట టోపీ పెట్టుకుని నిద్రపోతే రక్తపోటు పెరుగుతుంది.
గుండె ఆరోగ్యం- రాత్రి నిద్రిస్తున్నప్పుడు టోపీ ధరించడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
చలికాలంలో మంచి నిద్ర కోసం టిప్స్
- గది ఉష్ణోగ్రత 18-20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచండి.
- గదిని చీకటిగా ఉంచండి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
- పడుకునే ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించవద్దు.
- మంచి నిద్ర కోసం పరుపు, దిండు కూడా ముఖ్యమైనవి.
- నిద్రపోయే ముందు కాఫీ లేదా టీ తీసుకోవడం మానుకోండి.