Stress At Work: పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!
పని ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే పని మధ్య విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు పని మధ్య విరామం తీసుకొని మళ్లీ ప్రారంభించినట్లయితే అది మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది.
- By Gopichand Published Date - 08:00 AM, Fri - 27 September 24

Stress At Work: కార్పొరేట్ ఉద్యోగులకు పని ఒత్తిడి (Stress At Work) ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. పని ఒత్తిడి కారణంగా పూణెలో ఓ మహిళ చనిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత లక్నోలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగి మరణించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పని ఒత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులకు ప్రెషర్ అనేది ఇబ్బందిగా మారింది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో పని ఒత్తిడిని నియంత్రించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పని ఒత్తిడిని నిర్వహించడానికి ఈ చిట్కాలను అనుసరించండి
విరామం అవసరం
పని ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే పని మధ్య విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు పని మధ్య విరామం తీసుకొని మళ్లీ ప్రారంభించినట్లయితే అది మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. అంతేకాకుండా బ్రేక్ టైమ్‌లో పని గురించే ఆలోచించకూడదు. కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులతో ఫోన్ మాట్లాడితే కాస్త రిలీఫ్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Musk Dating Meloni: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్.. అసలు నిజమిదే..!
సంభాషణ పరిష్కారం
మీరు పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతుంటే సహోద్యోగులతో మాట్లాడటం ద్వారా మీ మనస్సును తేలికపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి ఈ పద్ధతి ఉత్తమం. మీరు ఇంటి నుండి పని చేస్తుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడండి.
సహోద్యోగుల నుండి సహాయం
పనిభారాన్ని నిర్వహించడానికి ఒక మార్గం మీ సహోద్యోగుల నుండి సహాయం తీసుకోవడం. సహాయం కోసం అడగడానికి మీరు వెనుకాడాల్సిన అవసరం లేదు. మీరు ఇలా చేయటం వలన ఒత్తిడి లేకుండా ప్రయోజనం పొందుతారు. మీరు పని ఒత్తిడి గురించి మీ బాస్‌తో కూడా మాట్లాడవచ్చు.
పుష్కలంగా నిద్ర, యోగా
పని ఒత్తిడి వల్ల వచ్చే ప్రెషర్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనిని నివారించడానికి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు తగినంత నిద్ర, యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు.