Diwali Sweets: దీపావళి రోజు ఇలాంటి స్వీట్స్ కొంటున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి ప్రమాదమే..!
దీపావళి రోజున ఒకరికొకరు రకరకాల మిఠాయిలు తినిపించి (Diwali Sweets) బహుమతులు అందజేసుకుంటారు.
- By Gopichand Published Date - 08:45 AM, Sun - 12 November 23

Health: దీపావళి పండుగ (Diwali 2023) నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దీపావళి రోజున ఒకరికొకరు రకరకాల మిఠాయిలు తినిపించి (Diwali Sweets) బహుమతులు అందజేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వీట్లకు డిమాండ్ పెరిగినప్పుడు నకిలీ స్వీట్ల సరుకులు మార్కెట్‌లోకి రావడం ప్రారంభమవుతుంది. మార్కెట్‌లో లభించే ఈ నకిలీ రసాయన ఆధారిత స్వీట్లు ఆరోగ్యానికి (Health) మంచిది కాదు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల కల్తీ మిఠాయిలను కొనుగోలు చేసే ముందు వాటిని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది. వీటి వల్ల నోటి క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే దీపావళి రోజున తీపి పదార్ధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
నకిలీ రసాయన ఆధారిత స్వీట్లు
ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపే నకిలీ స్వీట్లను తయారు చేయడానికి అనేక ఇతర వస్తువులను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఖోయా, బంగాళదుంప, అయోడిన్, డిటర్జెంట్, సింథటిక్ మిల్క్, వైట్‌నర్, సుద్ద, యూరియా ఇలా రకరకాల రసాయనాలతో స్వీట్‌లను తయారు చేసి ఈ స్వీట్‌లను అలంకరించేందుకు సిల్వర్ వర్క్‌కు బదులు అల్యూమినియం వర్క్‌ను ఉపయోగిస్తున్నారు.ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. అందువల్ల దీపావళి రోజున మిఠాయిలు కొనుగోలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు.
Also Read: Green Peas Advantages: పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
తీవ్రమైన వ్యాధులు రావచ్చు
ఇలాంటి నకిలీ మిఠాయిల వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, లుకేమియా, కిడ్నీ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, అనేక రకాల అలర్జీలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు స్వీట్లను కల్తీ చేస్తున్నప్పుడు మోసగాళ్ళు కొన్నిసార్లు స్టార్చ్, అసంతృప్త కొవ్వు వంటి వాటిని కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. శరీరంలో విషంగా మారుతాయి. అందుకని మిఠాయిలు కొనే సమయంలో మిఠాయిలు కల్తీ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
We’re now on WhatsApp. Click to Join.
కల్తీ స్వీట్లలో ఉండే స్టార్చ్, అసంతృప్త కొవ్వు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతే కాకుండా స్వీట్లపై అల్యూమినియం యాడ్ చేయటం వల్ల కడుపులోకి చేరి మెదడుకు, ఎముకలకు తీవ్ర హాని కలుగుతుందని, దీని వినియోగం పిల్లల కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.