Asthma: ఆస్తమాతో బాధపడుతున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఈ సమస్య లక్షణాలివే..!
ఆస్తమా అనేది ఒక వ్యాధి. దానిని నివారించి చికిత్స చేస్తే సమస్యలు రావు. కానీ బాధితులు అజాగ్రత్తగా ఉంటే అది ప్రాణాంతకం కూడా కావచ్చు.
- By Gopichand Published Date - 08:15 PM, Thu - 25 July 24

Asthma: బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు పేరొందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా మిలియన్ల మంది అభిమానులను సాధించింది. ప్రియాంక అంతర్జాతీయ స్టార్. అయితే ప్రియాంక చోప్రా ఆస్తమా (Asthma) వంటి వ్యాధికి గురవుతుందని మీకు తెలుసా..? ప్రియాంక చోప్రా ఆస్తమా బాధితురాలు అని చాలామందికి తెలియకపోవచ్చు. ఇది మాత్రమే కాదు ఐదేళ్ల వయస్సు నుండి ఆమె ఆస్తమా పేషెంట్ అని ప్రియాంక స్వయంగా సోషల్ మీడియాలో కొన్ని సంవత్సరాల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆస్తమా అనేది ఒక వ్యాధి. దానిని నివారించి చికిత్స చేస్తే సమస్యలు రావు. కానీ బాధితులు అజాగ్రత్తగా ఉంటే అది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఆస్తమా అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం.
ఆస్తమా అంటే ఏమిటి?
ఆస్తమా అనేది నిజానికి ఏ వయసు వారికైనా వచ్చే శ్వాసకోశ వ్యాధి. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధిగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. కానీ దుమ్ము, వాయు కాలుష్యం, చిన్న పుప్పొడి, సిగరెట్ పొగ, చల్లటి గాలి, అలెర్జీ కారకాలతో సంబంధం కలిగి ఉండటం, వాతావరణంలో మార్పు మొదలైన వాటి వలన ఈ వ్యాధి బాధితులు ఇబ్బందులు పడుతుంటారు.
ఊపిరితిత్తులలోకి చెక్క రంపపు పొట్టు, జంతువుల జట్టు, చుండ్రు, రసాయనాలు, పీచు పదార్థాలు మొదలైన వాటిని పీల్చినప్పుడు ఆస్తమా ఎటాక్ అవ్వొచ్చు. అయితే ఆస్తమా సంభవించే ప్రదేశాలలో కొంతమంది పని చేస్తారు. కొంతమందికి చిన్నతనంలోనే ఈ సమస్య వస్తుంది. మారుతున్న వాతావరణంలో ఉన్న అలెర్జీ ట్రిగ్గర్స్ కారణంగా కొంతమంది ఈ వ్యాధికి గురవుతారు. ఆస్తమా అటాక్ సమయంలో శ్వాసకోశంలో గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
We’re now on WhatsApp. Click to Join.
లక్షణాలు
ఆస్తమాలో శ్వాస సమస్యలు వస్తాయి. ఆస్తమా ఉంటే.. నిరంతర దగ్గు ఉంటుంది. ఊపిరి పీల్చుకునేటప్పుడు ఛాతీలో గురకగా అనిపిస్తుంది. నడిచినా, చిన్న పని చేసినా ఊపిరి ఆడకపోవడం మొదలవుతుంది. రోగి ఛాతీలో బిగుతు ఉంది. భారం అనిపిస్తుంది. ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఈల శబ్దం వినబడుతుంది. రోగి గొంతులో చాలా కఫం అంటే శ్లేష్మం ఏర్పడటం ప్రారంభమవుతుంది. బాధితులు అకస్మాత్తుగా అలసిపోతారు. ఒత్తిడికి గురవుతారు. సాధారణంగా ఆస్తమా లక్షణాలు దాని దశ, తీవ్రతను బట్టి మారుతూ ఉంటాయి. ఉబ్బసం మొదట్లో శ్వాస ఆడకపోవడం ప్రారంభమవుతుంది.