HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Potential Downsides Of Sleeping In A Sweater

రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవచ్చా?

మందపాటి బట్టలు ఛాతీపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్నిలోని సూక్ష్మ రేణువులు శ్వాస ద్వారా ముక్కులోకి వెళ్లడం వల్ల అలర్జీలు రావచ్చు. ఆస్తమా రోగులకు ఇది మరింత ప్రమాదకరం.

  • Author : Gopichand Date : 30-12-2025 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sleeping With Sweater
Sleeping With Sweater

Sleeping With Sweater: చలికాలంలో రాత్రిపూట నిద్రపోయేటప్పుడు చలి వేయడం వల్ల చాలామంది స్వెటర్లు, జాకెట్లు లేదా సాక్స్ ధరించి పడుకుంటారు. దీనివల్ల శరీరం వెచ్చగా అనిపించినప్పటికీ, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవచ్చా?

ఆరోగ్య పరంగా చూస్తే.. రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవడం సరైనది కాదు. తీవ్రమైన చలి ఉన్నప్పుడు తప్ప, రోజువారీగా మందపాటి ఉన్ని బట్టలు వేసుకుని పడుకోవడం వల్ల నష్టాలు ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రక్త ప్రసరణలో ఆటంకం: ఉన్ని బట్టలు శరీరానికి హత్తుకుని ఉండటం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల కంగారు, అసౌకర్యం కలగవచ్చు.

చర్మ సమస్యలు: ఉన్నిలోని పీచు వల్ల చర్మంపై దురద, దద్దుర్లు రావచ్చు. ముఖ్యంగా ఎగ్జిమా ఉన్నవారికి లేదా సున్నితమైన చర్మం ఉన్నవారికి చర్మం పొడిబారి ఇబ్బంది కలుగుతుంది.

శరీర ఉష్ణోగ్రత పెరగడం: ఉన్ని శరీరం లోపలి వేడిని బయటకు వెళ్లకుండా ఆపుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి చెమట పట్టడం, నిద్ర మధ్యలో మెలకువ రావడం జరుగుతుంది. బీపీ ఉన్నవారికి దీనివల్ల కళ్ళు తిరగడం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి సంభవించవచ్చు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: మందపాటి బట్టలు ఛాతీపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్నిలోని సూక్ష్మ రేణువులు శ్వాస ద్వారా ముక్కులోకి వెళ్లడం వల్ల అలర్జీలు రావచ్చు. ఆస్తమా రోగులకు ఇది మరింత ప్రమాదకరం.

Also Read: వందే భారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? (వీడియో)

చలికాలంలో ఎలాంటి బట్టలు ధరించి పడుకోవాలి?

రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి.

తేలికపాటి దుస్తులు: చాలా మందపాటి లేదా బరువైన బట్టలకు బదులుగా తేలికపాటి బట్టలను పొరలు పొరలుగా ధరించండి. ఉదాహరణకు పల్చని కాటన్ బట్టల పైన ఒక లైట్ థర్మల్ వేసుకోవచ్చు.

సాక్స్: చాలా మందపాటి సాక్స్‌లు ధరించడం వల్ల అసౌకర్యం కలుగుతుంది. వాటికి బదులుగా పల్చని కాటన్ సాక్స్‌లు ధరించడం మంచిది.

దుప్పటి: భారీ స్వెటర్లు లేదా జాకెట్లు వేసుకునే బదులు, మంచి నాణ్యమైన మందపాటి రగ్గు లేదా దుప్పటి కప్పుకోవడం ఉత్తమం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • Health News Telugu
  • Health Tips Telugu
  • lifestyle
  • sleeping tips
  • Sleeping With Sweater

Related News

Chilblain

చలికాలంలో కాలి వేళ్ల మధ్య వచ్చే దురద, మంటను తగ్గించే చిట్కాలు, పాటిస్తే అంతా క్లియర్

చలికాలం వచ్చిందంటే.. చాలా మందికి చేతులు, ముఖ్యంగా కాలి వేళ్లు లేదా మధ్యలో వాపు, దురద వస్తుంది. ఈ పరిస్థితిని చిల్‌బ్లెయిన్స్ అంటారు నిపుణులు. ఇది తరచుగా తీవ్రమైన చలికి గురికావడం వల్ల వస్తుంది. మీరు చలికాలంలో ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రముఖ డైటీషియన్ ఈ పరిస్థితిని నివారించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు చెప్పారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్ద

  • Is popcorn good for our health? What vitamins does it contain?

    పాప్ కార్న్ మ‌న ఆరోగ్యానికి మంచిదేనా..? దీనిలో ఉండే విటమిన్ ఏది?

  • Teeth Brush

    నిద్రలేవగానే బ్రష్ చేయ‌కూడ‌దా? నిపుణుల స‌మాధానం ఇదే!

  • Milk

    పాలు తాగడం అందరికీ మంచిది కాదా? డాక్టర్ల కొత్త హెచ్చరిక!

  • How good are eggs for health?..in what quantity? How to eat them?

    కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు?..ఎంత మోతాదులో? ఎలా తినాలి?

Latest News

  • రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవచ్చా?

  • వందే భారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? (వీడియో)

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం జ‌ట్టులోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న మ‌లింగ‌!

  • శ్రీలంక‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 5-0తో సిరీస్ కైవ‌సం!

  • సీఎం రేవంత్ పాల‌నలో స్థిరత్వం నుంచి స్మార్ట్ డెవలప్మెంట్‌ దిశగా తెలంగాణ‌!

Trending News

    • కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!

    • రేపే ఏకాద‌శి.. ఇలా చేయ‌కుంటే పూజ చేసిన వృథానే!!

    • ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

    • రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

    • 2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd