HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >How To Prevent Brain Worms

Brain Worms: మెదడులో పురుగులు రాకుండా ఉండాలంటే కూరగాయలను ఎలా కడగాలి?

ఈ కూరగాయలు కడుపులోకి వెళ్లినప్పుడు కడుపులోని యాసిడ్‌లు ఈ పురుగులను చంపలేవు. అవి ప్రేగుల నుండి మెదడులోకి చేరుతాయి. ఈ గుడ్లు మెదడుకు చేరినప్పుడు వాపు కలిగిస్తాయి.

  • Author : Gopi Date : 31-10-2025 - 10:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brain Fog
Brain Fog

Brain Worms: మనమందరం రోజూ కూరగాయలు తింటాం. కూరగాయలు మన రోజువారీ ఆహారంలో భాగం, ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవసరం. అయితే కోతకు ముందు వాటిపై క్రిమిసంహారక మందులు చల్లుతారు. అలాగే కూరగాయలలో మట్టి కూడా ఉంటుంది. దీని వలన ఈ కూరగాయలను తిన్నప్పుడు శరీరంలోకి క్రిములు చేరవచ్చు. అందువల్ల కూరగాయలను సరిగ్గా శుభ్రం చేయడం ముఖ్యం. లేదంటే ఈ అపరిశుభ్రమైన కూరగాయల ద్వారా మెదడులోకి పురుగులు (Brain Worms) చేరే అవకాశం ఉంది.

మెదడులోని పురుగులు అంటే ఏమిటి? అవి ఎలా కనిపిస్తాయి? ఈ పురుగులు మెదడులోకి చేరకుండా ఉండటానికి కూరగాయలను ఎలా కడగాలి అనే విషయాలను ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. మెదడులోని పురుగులను దూరంగా ఉంచడానికి కూరగాయలను ఎలా కడగాలో వారి ద్వారానే తెలుసుకుందాం.

మెదడులో పురుగులు ఎలా వస్తాయి?

న్యూరోసిస్టిసెర్కోసిస్ (Neurocysticercosis) అంటే మెదడులోని పురుగు. ఈ పురుగును టీనియాసోలియం (Taenia Solium) అని అంటారు. ఈ పురుగు మెదడులో పాకే పురుగు కాదు. కానీ ఈ పురుగు గుడ్లు మట్టి కింద పెరిగే కూరగాయలలో మట్టి ఉండిపోయే కూరగాయలలో ముఖ్యంగా క్యాబేజీ వంటి వాటిలో ఉంటాయి.

ఈ కూరగాయలు కడుపులోకి వెళ్లినప్పుడు కడుపులోని యాసిడ్‌లు ఈ పురుగులను చంపలేవు. అవి ప్రేగుల నుండి మెదడులోకి చేరుతాయి. ఈ గుడ్లు మెదడుకు చేరినప్పుడు వాపు కలిగిస్తాయి. ఎందుకంటే మెదడులోకి ఏదైనా బయటి వస్తువు వెళ్లినప్పుడు శరీరం దానికి ప్రతిస్పందిస్తుంది. మెదడులోని ఈ పురుగుల గుడ్ల కారణంగా మెదడులో వాపు వస్తుంది. వాపు కారణంగా తలనొప్పి వస్తుంది. ఫిట్స్ వస్తుంది. పిల్లలలో ఫిట్స్ రావడానికి ఒక ప్రధాన కారణం న్యూరోసిస్టిసెర్కోసిస్. ఈ పురుగుల నుండి రక్షించుకోవడానికి కూరగాయలను సరిగ్గా కడగడం ఒక్కటే మార్గం.

Also Read: H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

మెదడు పురుగుల నుండి రక్షణ కోసం కూరగాయలను ఎలా కడగాలి?

మెదడులోకి పురుగులు రాకుండా ఉండాలంటే కూరగాయలను శుభ్రం చేసే సరైన పద్ధతి తెలుసుకోవాలి. వైద్యులు చెప్పిన ప్ర‌కారం.. పారుతున్న నీటిలో శుభ్రం చేయండి. కూరగాయలను పంపు నుండి పారుతున్న నీటిలో 5 నిమిషాల పాటు కడగాలి. ఆ తర్వాత కూరగాయలను ఆరబెట్టి ఆపై నిల్వ చేసుకోవాలి. బేకింగ్ సోడా ఉపయోగించండి. ఒక చెంచా బేకింగ్ సోడాను 2 గ్లాసుల నీటిలో వేసి ఆ నీటిలో కూరగాయలను 5 నుండి 10 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత పారుతున్న నీటిలో కడిగి, ఆరబెట్టి నిల్వ చేయండి.

ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి

పొరలున్న కూరగాయలు: క్యాబేజీ, కాలీఫ్లవర్ (Cauliflower) వంటి పొరలున్న కూరగాయలను శ్రద్ధగా కడగాలి.

పచ్చి కూరగాయలు వద్దు: పచ్చి కూరగాయలను తినకుండా ఉండాలి.

బయటి ఆహారం: బయట నూడుల్స్, బర్గర్ లేదా సలాడ్ వంటి వాటిలో పచ్చి కూరగాయలను తక్కువగా తినండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brain Health
  • brain worms
  • health
  • Health Tips Telugu
  • lifestyle
  • Vegetables

Related News

Jeans

జీన్స్ ప్యాంట్‌తోనే ప‌డుకుంటున్నారా?

జీన్స్ క్లాత్ చెమటను సరిగ్గా పీల్చుకోదు. రాత్రంతా చర్మంపై తేమ, చెమట అలాగే పేరుకుపోవడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతాయి.

  • Muskmelon Peel

    కర్బూజా పండు కంటే తొక్కలే ఎక్కువ ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయా?

  • Side Effects Of Chia Seeds

    చియా సీడ్స్ అతిగా తీసుకుంటే ప్రమాదకరమా?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd