Heart Attack: సోమవారం వచ్చిందా.. అయితే గుండెపోట్లు పెరిగినట్టే..!
సోమవారం ఉదయం గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
- By Gopichand Published Date - 12:37 PM, Wed - 17 July 24

Heart Attack: సోమవారం ఉదయం గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. గణాంకాల ప్రకారం.. సోమవారం గుండెపోటు ప్రమాదం సుమారు 13% పెరుగుతుంది. ఈ విషయం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చర్చకు వచ్చింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన సమాజంలో యువకుల నుంచి ముసలివాళ్ల వరకు చాలామంది గుండెపోటు బారినపడి మరణిస్తున్నారు.
ప్రస్తుతం సోమవారాల్లో గుండెపోటులు పెరగడంపై చర్చ జరుగుతోంది. అంతకుముందు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ (BHF) నివేదిక కూడా సోమవారం గుండెపోటు ప్రమాదం 13% ఎక్కువగా ఉందని పేర్కొంది. దీనిని ‘బ్లూ సోమవారం’ అని కూడా అంటారు.
ఎక్కువ గుండెపోటులు ఎప్పుడు సంభవిస్తాయి?
సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే దీని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. సోమవారం ఉదయం నిద్రలేచిన తర్వాత రక్తంలో కార్టిసాల్, హార్మోన్లు చాలా ఎక్కువగా ఉంటాయని మాత్రమే అంచనా వేస్తున్నారు. దీనికి కారణం సిర్కాడియన్ రిథమ్ కావచ్చు, ఇది సరైన నిద్ర, మేల్కొలుపు చక్రాన్ని నిర్వహించడానికి పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్ర, మేల్కొలుపు చక్రంలో మార్పు ఆరోగ్యంపై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
సోమవారం ఉదయం గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది?
వారాంతాల్లో చాలా మంది తమ అభిమాన షోలను చూస్తారని లేదా కుటుంబం, స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్తుంటారు. దానివల్ల రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారు. దీని కారణంగా వారి నిద్ర, మేల్కొనే సమయాలు ప్రభావితమవుతాయి. సిర్కాడియన్ రిథమ్‌లో మార్పులు ఆదివారం రాత్రి నిద్రలేమికి దారితీయవచ్చు. దీనిని ‘సోషల్ జెట్ లాగ్’ అని కూడా అంటారు. నిద్ర లేకపోవటం లేదా నాణ్యత లేని నిద్ర రక్తపోటు. కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇవి గుండెపోటుకు ప్రధాన కారణాలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.