Health Tips: ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు అస్సలు తినకూడదట!
ఎక్కువగా కారం (Spicy Foods) లేదా మసాలాలు ఉన్న ఆహారం తినడం వల్ల కడుపులో మంట, అజీర్ణం (Indigestion), అల్సర్ (Ulcer) వంటి సమస్యలు రావొచ్చు. ఇది ప్రేగుల పొరను కూడా దెబ్బతీస్తుంది.
- By Gopichand Published Date - 10:46 PM, Mon - 13 October 25

Health Tips: ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ (Health Tips) మన సంపూర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. కడుపు సరిగా లేకపోతే శరీరం శక్తి, రోగనిరోధక శక్తి (Immunity), మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుంది. మనం కొన్నిసార్లు తెలియకుండానే మన ప్రేగులకు హాని కలిగించే ఆహారాలను తీసుకుంటాం. కాబట్టి మీ ప్రేగు ఆరోగ్యానికి చాలా హానికరం. ఆరోగ్యానికి నష్టం కలిగించే 3 రకాల ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సిట్రస్ పండ్లు (Citrus Fruits)
మీరు నారింజ, నిమ్మకాయ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లను (Citrus Fruits) సేవిస్తే అవి ప్రేగు ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నప్పటికీ అవి చాలా ఆమ్ల (acidic) స్వభావం కలిగి ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తింటే కడుపులో మంట, ఎసిడిటీ (Acidity) సమస్యలు రావచ్చు. అందుకే వీటిని సేవించకుండా ఉండడం మంచిది.
బ్లాక్ కాఫీ (Black Coffee)
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ (Black Coffee) తాగేవాళ్లు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఆ కోవలో ఉన్నట్లయితే ఈ రోజు నుంచే ఆ అలవాటును మానేయండి. కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఏమీ తినకుండా దీన్ని తాగడం వల్ల గుండెల్లో మంట (Heartburn), ప్రేగులలో వాపు (Intestinal Inflammation) వంటి సమస్యలు రావచ్చు.
కారం/మసాలాలు ఉన్న ఆహారం
ఎక్కువగా కారం (Spicy Foods) లేదా మసాలాలు ఉన్న ఆహారం తినడం వల్ల కడుపులో మంట, అజీర్ణం (Indigestion), అల్సర్ (Ulcer) వంటి సమస్యలు రావొచ్చు. ఇది ప్రేగుల పొరను కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఖాళీ కడుపుతో మీరు పొరపాటున కూడా ఎలాంటి కారంగా ఉండే ఆహారాన్ని తినవద్దు.