HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Follow These Precautions For Your Heart Health

Heart Health: మీ గుండె ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు పాటించండి..!

మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన, సున్నితమైన భాగాల్లో గుండె ఒకటి. ఈ మధ్యకాలంలో కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండె జబ్బుల నుంచి

  • Author : Maheswara Rao Nadella Date : 12-03-2023 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heart Health
Heart Health

మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన, సున్నితమైన భాగాల్లో గుండె (Heart) ఒకటి. గుండెను జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనం జీవించగలం. దానికి ఏ చిన్న సమస్య వచ్చినా.. ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కొందరు చిన్నవయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు రావడానికి.. విపరీతమైన ఒత్తిడి, స్మోకింగ్‌, మధ్యపానం ప్రధాన కారణాలు. కలుషిత గాలి, ఆహారపు అలవాట్లు కూడా గుండె (Heart) సమస్యలకు కారణాలు అని నిపుణులు అంటున్నారు. గుండె బలహీనంగా ఉంటే.. మీరు కరోనరీ ఆర్టరీ డిసీజ్, అరిథ్మియా, గుండె కండరాల సమస్యలు, గుండె కవాట సమస్యలు వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గుండె వీక్‌గా ఉంటే.. ఛాతీ నొప్పి, ఛాతీ బిగుతుగా ఉండటం, శ్వాస ఆడకపోవడం, మెడ-దవడ నొప్పి, చేతు, కాళ్లలో తిమ్మిరి, అసాధారణ హృదయ స్పందన వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండటానికి.. దాన్ని దృఢంగా తయారు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయమం, ధ్యానం లాంటివి చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

నడవండి:

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించన పరిశోధన ప్రకారం రోజూ తగినంత నడిస్తే.. గుండె సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. మెడికల్ న్యూస్ టుడే ప్రకారం, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 6000 అడుగులు నడవాలి. ఆరు వేలు/ అంతకంటే ఎక్కువ అడుగులు నడవడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

విటమిన్‌ కె తీసుకోండి:

గుండెజబ్బు ముప్పు తగ్గడానికి, రక్తప్రసరణ మెరుగుపడడానికి విటమిన్‌ కె సహాయపడుతుంది. రక్తనాళాల్లో కాల్షియం పోగుపడటాన్నీ తగ్గిస్తుంది. వీటిని రక్తనాళాల నుంచి తిరిగి ఎముకలు, దంతాల్లోకి చేర్చటానికీ ఉపయోగపడుతుంది. సార్‌డైన్‌ వంటి చేపల్లో, ఆకుకూరలు, క్యాబేజీ, పచ్చిబఠాణీ వంటి ఆహార పదార్థాల్లో విటమిన్‌ కె మెండుగా ఉంటుంది. మనకు రోజుకు 120 మైక్రోగ్రామలు విటమిన్‌ కె అవసరం.

ఫైబర్‌ తీసుకోండి:

నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఫైబర్‌ హైబీపీని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో హార్ట్‌ ఎటాక్‌ ముప్పు తగ్గుతుంది. రోజుకు ఐదు నుంచి 10 గ్రాములు ఫైబర్‌ మీ రక్తంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. బీన్స్, అవకాడోలు, బెర్రీలు, నట్స్, ఓట్స్‌, బార్లీ, ఆపిల్‌, క్యారెట్‌, అవిసె గింజలు, జామకాయలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, కోడిగుడ్డు, వాల్‌నట్స్‌, బ్రొకోలి, కొత్తిమీర, అవిసె గింజలు, ఆలీవ్‌ ఆయిల్‌, అవకాడో,చియా గింజలు,పిస్తా,చేపల్లో టూనా చేపలు,సాల్మన్ చేపలు, మెర్రింగ్, వంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని మనం ప్రతీరోజు తినాలి.

వ్యాయమం చేయండి:

రోజూ వ్యాయామం చేయడం.. ఎక్కువగా శారీరక శ్రమ ఉండే పనులు చేసేవారిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు గుండె వేగాన్ని పెంచే వ్యాయామాలు 10 నిమిషాలు చేసినా.. మంచిదని నిపుణులు అంటున్నారు. ఉన్నచోటే ఎగరటం, గుంజీలు తీసినట్టు పిరుదులను మోకాళ్ల ఎత్తు వరకు వచ్చేలా నడుమును కిందికి తేవటం, కాళ్లు లేపటం, చేతులు తిప్పటం వంటివి చేయండి

ప్రాణాయామం, ధ్యానం:

ఒత్తిడి తగ్గడానికి దోహదం చేసే ప్రాణాయామం, ధ్యానం వంటి వాటితో గుండెజబ్బు ముప్పు 48% వరకు తగ్గుతున్నట్టు అధ్యయనాలు స్పష్టంచేశాయి. రోజూ కొంతసేపు ప్రశాంతమైన వాతావరణంలో వీటిని సాధన చేస్తే గుండె ఆరోగ్యానికి మంచిది.

Also Read:  Remuneration: రెమ్యూనరేషన్ లో ప్రభాస్ ను దాటేసిన అల్లు అర్జున్?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Follow
  • food
  • Habits
  • health
  • heart
  • Life Style
  • Precations
  • tips
  • Tricks

Related News

Gut Health

Gut Health: పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.. తినాల్సిన ఫుడ్స్

Gut Health మన పేగులు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర శక్తిని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన గట్ హెల్తీ లైఫ్‌స్టైల్‌కు సంకేతం. అయితే, కొన్నిసార్లు పేలవమైన ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సరైన పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన పేగును

  • Asia Book Of Records

    Asia Book of Records : ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డానోన్ ఇండియా

  • Fatty Liver Stages

    Fatty Liver: సన్నగా ఉన్నవారిలో కనిపించే ఫ్యాటీ లివర్ గురించి నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!

  • Brain Damage

    నిద్ర లేక‌పోతే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా?

Latest News

  • Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  • IPL 2026 : సన్‌రైజర్స్‌తో చేతులు కలిపిన జిందాల్

  • Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Jewar Airport : ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోడీ శ్రీకారం!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd