Remuneration: రెమ్యూనరేషన్ లో ప్రభాస్ ను దాటేసిన అల్లు అర్జున్?
పుష్ప 2 తర్వాత నెక్ట్స్ సినిమాను కూడా బన్నీ ట్రాక్ ఎక్కించేస్తున్నారు. అందులో ముందుగా బాలీవుడ్ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది.
- By Maheswara Rao Nadella Published Date - 06:30 PM, Sat - 11 March 23

“పుష్ప ది రైజ్” మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశంలో మంచి పేరొచ్చింది. ఇప్పుడు “పుష్ప 2 ది రూల్” సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పుష్ప 2 తర్వాత నెక్ట్స్ సినిమాను కూడా బన్నీ ట్రాక్ ఎక్కించేస్తున్నారు. అందులో ముందుగా బాలీవుడ్ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ఈ సినిమాను తెరకెక్కించబోతుండగా టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మూవీని నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సందీప్ వంగాతో చేయబోతున్న సినిమాకు బన్నీ కళ్లు చెదిరే రెమ్యూన రేషన్‌ను తీసుకోబోతున్నారట. అల్లు అర్జున్ కు ఏకంగా రూ.120 కోట్లు రెమ్యూనరేషన్‌ను (Remuneration) ఇచ్చే ఛాన్స్ ఉందట. బన్నీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి భూషణ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది టాక్.అల్లు అర్జున్ తొలుత రూ.150 కోట్లు డిమాండ్ చేయగా.. చివరకు రూ.120 కోట్లకు డీల్ ఫైనల్ అయిందని అంటున్నారు. ఈ లెక్కన రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్‌ను బన్నీ దాటేశాడని అంటున్నారు. ఎందుకంటే ఇదే టి సిరీస్ బ్యానర్‌లో రానున్న ‘ఆది పురుష్’ మూవీలో ప్రభాస్‌కి రూ.100 కోట్లను రెమ్యూనరేషన్‌గా (Remuneration) భూషణ్ కుమార్ ఇచ్చారట.
1,000 కోట్ల బిజినెస్ చేసే అవకాశం:
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ తో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో సుకుమార్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా 1000 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
అల్లు అర్జున్ రేంజ్ మరో స్థాయికి:
ఇక సినిమా సక్సెస్ అయితే మాత్రం అల్లు అర్జున్ రేంజ్ మరో స్థాయికి వెళ్ళిపోతుంది అని చెప్పవచ్చు. మార్కెట్ పరంగా అయితే ఆ సినిమా తప్పకుండా 1000 కోట్లు దాటాలి అని అల్లు అర్జున్ అందరికంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని డీల్స్ కూడా చర్చల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిర్మాతలు కూడా అదే టార్గెట్ తో బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Health Insurance Plan: నూటికి నూరు శాతం చెల్లించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏమిటో తెలుసా?

Related News

Actress Laya: నటి లయ అమెరికాలో ఎంత శాలరీ కి పని చేసిందో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి హీరోయిన్ లయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.