వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను నివారిస్తుందా?!
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను పూర్తిగా నివారిస్తుందని లేదా నయం చేస్తుందని గ్యారెంటీ ఇవ్వలేం. కానీ ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
- Author : Gopichand
Date : 19-12-2025 - 3:22 IST
Published By : Hashtagu Telugu Desk
Garlic Water: క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఎప్పుడు, ఎలా వస్తాయో చెప్పలేం. అందుకే ప్రస్తుతం చాలా మంది తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆయుర్వేద చిట్కాలను విశ్వసిస్తున్నారు. నేటి మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడి, మనం త్వరగా తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నాం. అటువంటి పరిస్థితిలో రోగనిరోధక శక్తిని పెంచే, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పును తగ్గించే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం ముఖ్యం.
వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను నివారిస్తుందా?
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను పూర్తిగా నివారిస్తుందని లేదా నయం చేస్తుందని గ్యారెంటీ ఇవ్వలేం. కానీ ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి నీరు తాగడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని శాస్త్రీయ అధ్యయనాల్లో వెల్లుల్లి నీరు లేదా వెల్లుల్లి తినడం ఆరోగ్యకరమని తేలింది. అయితే ఇది క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తుందనడానికి శాస్త్రీయంగా పూర్తి ఆధారాలు లేవు.
Also Read: దేశ రక్షణలో భాగం కాబోతున్న పూడూరు సర్పంచ్
వెల్లుల్లి నీటిలో ఏం కలపాలి?
వెల్లుల్లి నీటిలో పసుపు, అల్లాన్ని కలపడం వల్ల దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. పసుపులో ఉండే కర్కుమిన్, వెల్లుల్లిలోని ‘యాంటీ ఆక్సిడెంట్’ గుణాలు శరీర రోగనిరోధక శక్తికి గొప్ప మద్దతునిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
హెల్తీ డ్రింక్ తయారీ విధానం
- ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో 4 వెల్లుల్లి రెబ్బలను దంచి వేయండి.
- ఇప్పుడు ఈ నీటిని గ్యాస్‌పై తక్కువ మంట మీద మరిగించండి.
- నీరు కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 2 చిటికెల పసుపు, 1 అంగుళం అల్లం ముక్కను వేయండి.
- నీటిని బాగా మరిగించి, ఆపై ఒక గ్లాసులోకి వడకట్టుకోండి.
- ఈ డ్రింక్‌ను ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు.
వెల్లుల్లి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
- రోగనిరోధక శక్తి పెరగడం.
- ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం లభించడం.
- జీర్ణవ్యవస్థ మెరుగుపడటం.
- శరీరాన్ని డిటాక్స్ (మలినాలను తొలగించడం) చేయడం.
- తీవ్రమైన వ్యాధుల ముప్పును తగ్గించడం.
గమనిక: దీనిని ఏదైనా వ్యాధికి సంపూర్ణ చికిత్సగా భావించవద్దు. ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమే ఈ డ్రింక్ తీసుకోండి. మీకు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటే దీనిని వాడే ముందు ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి.