Root Vegetables: చలికాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇవి తినాల్సిందే..!
భారతీయ ఆహారంలో ముఖ్య భాగమైన వెల్లుల్లి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, ఇతర సల్ఫర్ సమ్మేళనాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
- By Gopichand Published Date - 08:10 PM, Sat - 1 November 25
Root Vegetables: చలికాలం వచ్చిందంటే మనం తీసుకునే ఆహారం నుంచి ధరించే దుస్తుల వరకు అన్నీ మారిపోతాయి. ఈ సీజన్‌లో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా వైరల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని ప్రత్యేకమైన కూరగాయలను (Root Vegetables) చేర్చుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా శీతాకాలంలో లభించే రూట్ వెజిటేబుల్స్ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి.
రూట్ వెజిటేబుల్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అద్భుతమైన వనరులు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి, శీతాకాలపు అనారోగ్యాల నుండి రక్షించడానికి సహాయపడతాయి. మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ముఖ్యమైన రూట్ వెజిటేబుల్స్, వాటి ప్రయోజనాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి.
క్యారెట్- కంటి చూపుకు మంచిది
చలికాలం రాగానే మార్కెట్‌లో ఎర్రటి క్యారెట్లు కనిపిస్తాయి. బీటా కెరోటిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉండే క్యారెట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ జీవక్రియ ప్రక్రియను మెరుగుపరచి, శరీరానికి శక్తిని అందిస్తుంది.
అల్లం- జీవక్రియకు ఉత్తేజం
చలికాలంలో అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే జింజెరోల్, షోగోల్ వంటి సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి. జీవక్రియను ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా అల్లం థర్మోజెనిక్ స్వభావం శరీర ఉష్ణోగ్రతను పెంచి తద్వారా జీవక్రియ కార్యకలాపాలు వేగవంతం కావడానికి సహాయపడుతుంది.
Also Read: CWC 25: టీమిండియా అభిమానుల్లో టెన్షన్ పెంచుతున్న ఫైనల్ మ్యాచ్ ఫొటో షూట్!
చిలగడదుంప- మధుమేహ రోగులకు మేలు
మీరు మధుమేహం (డయాబెటిస్) రోగి అయినప్పటికీ చిలగడదుంప చాలా మేలు చేస్తుంది. ఫైబర్, విటమిన్ ఏ, సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే చిలగడదుంప రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణను నెమ్మదింపజేసి, ఇన్సులిన్ నిరోధకత అవకాశాన్ని తగ్గిస్తుంది.
ముల్లంగి- జీర్ణక్రియకు సహకారి
ముల్లంగిలో ఉండే గ్లూకోసినోలేట్స్ వంటి సమ్మేళనాలు ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పోషకాల శోషణను ప్రోత్సహిస్తుంది. జీవక్రియ చర్యలకు మద్దతునిస్తుంది.
వెల్లుల్లి- యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు
భారతీయ ఆహారంలో ముఖ్య భాగమైన వెల్లుల్లి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, ఇతర సల్ఫర్ సమ్మేళనాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడం ద్వారా జీవక్రియ చర్యలను ప్రోత్సహిస్తాయి. తద్వారా జీవక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది.