HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >When Is Poli Padyami Poli Is The Specialty Of Heaven

Kathika Amavasya : పోలి పాడ్యమి ఎప్పడు అంటే? పోలి స్వర్గం విశిష్టత.!

  • Author : Vamsi Chowdary Korata Date : 20-11-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kathika Amavasya
Kathika Amavasya

కార్తీక మాసం అమావాస్య  తర్వాత రోజు మార్గశిర పాడ్యమి రోజును పోలి పాడ్యమి  అంటారు. ఈ రోజే ప్రవహించే నీటిలో దీపాలు విడిచిపెట్టి కార్తీక వ్రతాన్ని ముగిస్తారు. అయితే పోలి స్వర్గం 2025 ఈ ఏడాది నవంబర్‌ 21 శుక్రవారం రోజు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలి పాడ్యమి 2025 డేట్‌, తిథి, పూజా విధానం తదితర విషయాలను తెలుసుకుందాం..

కార్తీక మాసం లో వచ్చే చివరి రోజును అంటే కార్తీక అమావాస్య 2025 తర్వాత రోజును పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి అంటారు. ఈ రోజు మహిళలు తెల్లవారుజామున చెరువులు లేదా నదులలో దీపాలు వదులుతారు. దీపదానం చేస్తారు. సాధారణంగా ఈ పోలి పాడ్యమి రోజు 30 వత్తులతో దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అనంతరం మూడు సార్లు నీటిని చేతులతో తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం  కథ వింటారు. ఈ నేపథ్యంలో పోలి పాడ్యమి 2025 తేదీ.. పోలి స్వర్గం 2025 పూజా విధానం గురించి తెలుసుకుందాం..

కార్తీక మాసం అంతా శివకేశవుల ఆరాధన, నదీ స్నానాలు, పూజలు, నోములతో సందడిగా గడిచిపోయింది. అయితే.. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం  ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది పోలి పాడ్యమి 2025 తిథి నవంబర్ 20వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్‌ 21వ తేదీ మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉన్న రోజు పోలి పాడ్యమి జరుపుకోవాలి కాబట్టి నవంబర్‌ 21వ తేదీ శుక్రవారం రోజు పోలి పాడ్యమి 2025 జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

పోలి పాడ్యమినే పోలి స్వర్గం అని.. పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు అని కూడా అంటారు. ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు నదులు లేదా చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. అనంతరం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. కార్తీక మాసమంతా దీపాలు వెలిగించని వాళ్లు పోలి పాడ్యమి రోజున 30 వత్తులతో దీపాలను వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈ పోలి పాడ్యమి రోజున 30 వత్తులతో దీపం వెలిగించి పారే నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. ఈ రోజున అరటి దొప్పలలో దీపాలు వెలిగించి పారే నీటిలో అంటే ప్రవహించే నదీ జలాలలో లేదా కాలువల్లో వదులుతారు. అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటిని చేతులతో ముందుకు తోస్తూ నమస్కరించుకుని.. ఆ తర్వాత పోలి స్వర్గం కథను విని అక్షింతలు వేసుకుంటారు.

శుక్రవారం లేదా మంగళవారం రోజు పోలి పాడ్యమిని జరుపుకోవచ్చా? అలాగే ఈ రెండు రోజుల్లో పోలి దీపాలు నీటిలో వదలవచ్చా అని చాలా మందిలో సందేహం ఉంది. అయితే వాస్తవానికి పోలి పాడ్యమిని వారం ఆధారంగా కాకుండా తిథి ఆధారంగా జరుపుకోవాలి. ఒకవేళ అలా కాదని మరుసటి రోజు అంటే శనివారం చేసుకుందామనుకుంటే ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు. కాబట్టి పాడ్యమి తిథి వచ్చిన రోజునే పోలి పాడ్యమి జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నవంబర్‌ 21 శుక్రవారం రోజున పోలి పాడ్యమి జరుపుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఈ ఏడాది పోలి స్వర్గం శుక్రవారం రోజు వచ్చింది. శుక్రవారం రోజున అమ్మవారిని ఇంటి నుంచి పంపించకూడదు కాబట్టి శనివారం రోజు అనుసరించాలని అంటున్నారు. అయితే తిథి ప్రకారం అయితే నవంబర్‌ 21వ తేదీ జరుపుకోవాల్సి ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Karthika Masam 2025
  • Kathika Amavasya
  • Poli Padyami
  • Poli Swargam
  • Skanda Puranam

Related News

    Latest News

    • దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?

    • స్విస్‌ నేతపై ట్రంప్ వింత వ్యాఖ్యలు..

    • ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?

    • అంబానీ దంపతులకు ఈడీ సమన్లు..పతనం అవుతున్న ‘రిలయన్స్’ షేర్లు!

    • క్రేజీ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టిన సోప్..ఎక్కడి వరకు వెళ్తుందో !!

    Trending News

      • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

      • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

      • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

      • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

      • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd