HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Henceforth Tirumala Donors Can Serve The Devotees Themselves

Tirumala : ఇక నుంచి తిరుమల దాతలు స్వయంగా భక్తులకు వడ్డించవచ్చు

తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా,

  • Author : Vamsi Chowdary Korata Date : 09-01-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srivari Seva Tickets
Srivari Seva Tickets

తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం కొనసాగిస్తోంది.‌ ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.33 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం రూ. 7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.12.65 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.12.65 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు.

తిరుమలలో (Tirumala) అన్నప్రసాద విభాగం సేవలు అందుతున్న ప్రాంతాలు

ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4( పాత అన్న ప్రసాదం ), పీఏసీ-2, అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం వద్ద, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, 2వ సత్రం, 3వ సత్రం, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు.

ప్రముఖ దినాల్లో 3 లక్షల మందికి పైగా

తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున 3లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు చట్నితో కలిపి ఉప్మా, పొంగళి, సేమ్యా ఉప్మా అందిస్తారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు చక్కెర పొంగలి, చట్ని, అన్నం, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు వడ్డిస్తున్నారు. తిరుమలలో (Tirumala) అన్నప్రసాదాల తయారీకి రోజుకు 14 నుంచి 16.5 టన్నుల బియ్యం, 6.5 నుంచి 7.5 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు.

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల మాదిరిగానే పది రోజుల ముందే మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక‌ ప్రవేశ టోకెన్లు టీటీడీ జారీ చేస్తూ వస్తుంది. అయితే జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది‌ రోజుల పాటు భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం‌ కల్పచాలనే ఉద్దేశంతో గత ఏడాది డిసెంబర్ నెల చివరిలో జనవరి 1వ తేదీ నుంచి 11వ తారీఖు వరకూ సంబంధించిన టోకెన్లను టీటీడీ‌ జారీ చేసింది. అయితే 12వ తేదీ నుంచి మిగిలిన రోజుల ప్రత్యేక‌ ప్రవేశ టోకెన్లను టీటీడీ పెండింగ్ పెట్టింది. అయితే  జనవరి 12వ తేదీ నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను రోజు వారి ఇరవై వేల చొప్పున ఈ‌నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని‌ సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.

Also Read:  Godadevi : భగవంతుడి మనసు గెలిచిన ఓ భక్తురాలి ప్రేమ కథ

ప్రజలకు విజ్ఞప్తి:

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎస్‌ఎస్‌డి టోకెన్ల జారీ కోటా ఆదివారంతో ముగియటంతో… జనవరి 12వ తేదీ నుండి ఏ రోజుకు ఆ రోజు ఉచిత దర్శన ఎస్.ఎస్.డి దర్శనాల కేటాయింపు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్‌లో మునుపటిలాగానే టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. గదులను ఆన్ లైన్లో బుక్ చేసుకోవటానికి ఆన్ లైన్ గదుల కోటా 12 జనవరి, 2023 నుండి 28 ఫిబ్రవరి, 2023 వరకు బుకింగ్ కోసం జనవరి 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది.

TTD Link: http://tirupatibalaji.ap.gov.in


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • devotional
  • Donors
  • god
  • Lord
  • srinivas
  • tirumala
  • Tirupati

Related News

Anant Ambani

అంబాజీ మాత ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.50 కోట్ల భారీ విరాళం

Anant Ambani  దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుటుంబం సంపాదనకే కాదు.. దాతృత్వంలోనూ ఫేమస్. పలు కార్యక్రమాల కోసం విరాళాలు అందిస్తుంటుంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు కూడా తరచుగా కోట్లల్లో విరాళాలు అందజేస్తుంటుంది. ఇప్పుడు ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. గుజరాత్‌లోని అంబాజీ మాతా ఆలయానికి రూ. 27.50 కోట్ల విరాళం ఇవ్వడం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ క

  • Mahashivratri

    మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

Latest News

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd