Films: సినిమాలు శుక్రవారమే ఎందుకు విడదలవుతాయో తెలుసా..?
మతపరమైన దృక్కోణంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజు. హిందూ మతంలో శుక్రవారం కొత్త పనిని ప్రారంభించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ఆనందం, శ్రేయస్సు, సంపదను తెస్తుందని చిత్ర నిర్మాతల నమ్మకం.
- By Gopichand Published Date - 08:47 PM, Fri - 9 August 24
Films: భారత్‌లో సినిమాల (Films) విడుదలకు వారంలో ఒక రోజుగా ‘శుక్రవారం’ ఫిక్స్ అయింది. సినీ నిర్మాతకు ఈ రోజు పరీక్ష కంటే తక్కువ కాదు. సినిమాని శుక్రవారం విడుదల చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అయితే మతపరమైన, జ్యోతిషశాస్త్ర కోణం నుండి చూస్తే దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సినిమా విడుదలకు శుక్రవారాన్ని ఎందుకు ఎంచుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమాలు శుక్రవారమే ఎందుకు విడుదలవుతాయి..?
మతపరమైన దృక్కోణంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజు. హిందూ మతంలో శుక్రవారం కొత్త పనిని ప్రారంభించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ఆనందం, శ్రేయస్సు, సంపదను తెస్తుందని చిత్ర నిర్మాతల నమ్మకం. శుక్రవారం లక్ష్మీ దేవి రోజు కావడంతో – వారికి సంపద చేకూరుతుందని చిత్రనిర్మాతలు నమ్ముతారు. శుక్రవారం విడుదలైతే సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు.
Also Read: ACB Raids : మున్సిపల్ ఆఫీసులో పనిచేసే సూపరింటెండ్ ఇంట్లో నోట్ల కట్టలు..
శుక్రవారం రిలీజ్ చేస్తే సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. దీనికి జ్యోతిష్యంతో కూడా లోతైన సంబంధం ఉంది. సినిమా, నిర్మాణం, వినోదం, ఇవన్నీ శుక్ర గ్రహానికి సంబంధించినవి. శుక్రుడు సంపద, ఆనందం, శ్రేయస్సుకు కారకంగా కూడా పరిగణిస్తారు. అందుకే శుక్రవారం సినిమాలని విడుదల చేయడం మరింత పుణ్యమని భావిస్తారు. శుక్ర గ్రహం గ్లామర్‌కు సంబంధించినది అయితే నటన, నాటకం, రంగస్థల ప్రదర్శన మొదలైనవి శుక్ర గ్రహానికి నేరుగా సంబంధించినవి. కాబట్టి ఈ రోజుకు ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు. శుక్రవారం శుక్ర గ్రహానికి సంబంధించిన పనులు చేయడం వల్ల విజయం చేకూరుతుందని నమ్ముతారు. పూర్తి విజయానికి గ్రహాల గణన, జాతక విశ్లేషణ కూడా అవసరమని భావిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
సినిమా విడుదలకు శుక్రవారం ప్రత్యేక రోజు
శుక్రవారం నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుందని సినీ పరిశ్రమ కూడా నమ్ముతోంది. ఈ రోజున సినిమా విడుదలైతే శని, ఆదివారాలు వరుసగా రెండు సెలవులు వస్తాయి. దాంతో సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుందని నిర్మాతలు నమ్ముతుంటారు.
Related News
Tovino Thomas : టాలీవుడ్ పై మలయాళం హీరో కౌంటర్.. తెలుగు మల్టీస్టారర్ చేస్తే మలయాళంలో నా కెరీర్ ఎండ్ అయిపోతుంది..
తాజాగా మలయాళం హీరో టోవినో థామస్ ఇండైరెక్ట్ గా టాలీవుడ్ వాళ్లకు కౌంటర్ వేసాడు.