ACB Raids : మున్సిపల్ ఆఫీసులో పనిచేసే సూపరింటెండ్ ఇంట్లో నోట్ల కట్టలు..
ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించామని.. కేసు నమోదు చేశామని.. విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు
- By Sudheer Published Date - 08:41 PM, Fri - 9 August 24

మున్సిపల్ ఆఫీసు ( Municipal Corporation Superintendent )లో పనిచేసే సూపరింటెండ్ ఇంట్లో నోట్ల కట్టలు చేసి ఏసీబీ (ACB) అధికారులు షాక్ అయ్యారు. ఓ బడా బిజినెస్ మాన్ , రాజకీయ నేత ఇంట్లో ఎలాగైతే నోట్ల కట్టలు ఉంటాయో ఆ రేంజ్ లో సూపరింటెండ్ ఇంట్లో డబ్బు బయటపడడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో సూపరింటెండెంట్ పనిచేసే దాసరి నరేందర్ (Dasari Narendra) ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు(ACB raids) నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు పక్క సమాచారం అందుకున్న అధికారులు ఒక్కరిగా అతడి ఇంటిపై దాడులు జరుపుగా.. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయట పడ్డాయి.
We’re now on WhatsApp. Click to Join.
నరేందర్ ఇంట్లో ఏకంగా రూ.2.93 కోట్ల నగదు పట్టుబడింది. అలాగే రూ.1.10 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ నరేందర్, అతని భార్య, తల్లి ఖాతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు 51 తులాల బంగారం, రూ.1.98 కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించారు.ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో.. దాసరి నరేందర్ దగ్గర దొరికిన మొత్తం ఆస్తులు అక్షరాల 7 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించామని.. కేసు నమోదు చేశామని.. విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఓ మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్ గా పనిచేసే ఓ ఉద్యోగి దగ్గర ఇన్ని కోట్లు ఉండడం అందర్నీ షాక్ కు గురిచేస్తుంది.
Read Also : Kodangal Lands Issue : కేటీఆర్ వద్దకు రేవంత్ పంచాయితీ