HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >War Losses Take A Break Stock Markets Gain

వార్‌ నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 05-03-2026 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Stock Market
Stock Market

Stock Market  మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ‌ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్ల లాభంతో 79,362 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,565 వద్ద ట్రేడవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణల భయాలతో నిన్న‌ సెషన్‌లో సూచీలు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

ఉదయం ట్రేడింగ్‌లో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల సూచీలు మినహా మిగతావన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ మెటల్ 1.23 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.43 శాతం మేర లాభపడి మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 1 శాతానికి పైగా లాభాలతో రాణిస్తున్నాయి.

హార్ముజ్ జలసంధి మూసివేత భయాలతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గత సెషన్‌లో 92.18కి పడిపోయినా, ప్రస్తుతం 91.66 వద్ద స్థిరపడింది. మరోవైపు అమెరికా, ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అవ్వడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపరిచింది.

టెక్నికల్‌గా నిఫ్టీకి 24,600-24,650 స్థాయిల వద్ద నిరోధం, 24,300-24,350 వద్ద మద్దతు ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక, మార్చి 4న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) రూ. 8,752 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DII) రూ. 12,068 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crude Oil Prices
  • DII
  • FII
  • Indian Stock Market
  • Indian stock markets
  • Market News
  • Nifty
  • rupee value
  • sensex
  • share market
  • stock market

Related News

New Momentum in the Market Due to Falling Oil Prices

Stock Markets: చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోవడం సూచీలకు జోష్ ఇచ్చింది. ఉదయం 9:16 గంటల సమయానికి సెన్సెక్స్ 835 పాయింట్ల లాభంతో 76,250 వద్ద, నిఫ్టీ 251 పాయింట్లు పెరిగి 23,970 వద్ద ట్రేడ్ అయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కు

    Latest News

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd