Anand Mahindra : చంద్రబాబు అన్‌స్టాపబుల్..ఆనంద్ మహీంద్రా సంచలనం..!
- By Vamsi Chowdary Korata Published Date - 04:13 PM, Wed - 19 November 25
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పారిశ్రామిక విధానాలపై.. ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో చంద్రబాబు.. ఆటోమేటిక్ ఎస్క్రో ఖాతా, ప్రోత్సాహకాల విడుదల, సావరిన్ గ్యారంటీ వంటి విధానాలు వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని రీపోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. చంద్రబాబు విజన్, విధానాల్లో కొత్తదనం తనకు ఎప్పుడూ ప్రేరణనిస్తాయని ట్వీట్ చేశారు. చంద్రబాబు తనతో పాటు తన చుట్టూ ఉన్నవారి స్థాయిని పెంచుతారు అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారన్న సంగతి తెలిసిందే. పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని.. రాష్ట్రమైనా, దేశమైనా ఆర్థికంగా పరిపుష్టం అవుతుందని ఆయన నమ్ముతారు. అందులో భాగంగా పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుకూలమైన విధానాలు రూపొందిస్తారు. కాలానుగణంగా ఆ విధానాల్లో మార్పులు చేయడంలో కూడా అందరికంటే ముందుంటారు. అయితే తాజాగా చంద్రబాబు పరిపాలనా దక్షతపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్ గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజన్‌కు తాను ఫిదా అయ్యాయని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
This man is an unstoppable force of nature.
What I’ve admired about him for decades is not just his obsession for development but his desire to always be innovative in his policies.
He raises the bar for himself and for everyone around him.
👏🏽👏🏽👏🏽
— anand mahindra (@anandmahindra) November 19, 2025
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో.. సీఎం చంద్రబాబు ప్రసంగించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆయన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రూపొందించిన విధానాలను వివరించారు. ఏ సంస్థ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంటే.. ఆటోమేటిక్‌గా ఎస్క్రో ఖాతా ఓపెన్ అవుతుందని చెప్పారు. ప్రోత్సాహకాల విడుదలపై ఆలస్యం కాకుండా.. అందులో రాయితీలు పడిపోతాయని తెలిపారు. బ్యాంక్ నుంచి నేరుగా నిధులు వెళ్లే విధానం ఉండటం వల్ల.. వ్యాపార వేత్తలు ఎవరినీ కలిసి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా సావరిన్ గ్యారంటీ కూడా ఇస్తామని వీడియోలో చెప్పారు. చంద్రబాబు నిర్ణయాలను పెట్టుబడిదారులు స్వాగతించారు.
ఈ వీడియోను ఆనందర్ మహీంద్రా రీపోస్ట్ చేశారు. “ఈ వ్యక్తి.. ప్రకృతిలాంటి ఆపలేని శక్తి. ఆయనకు ఉన్న విజన్, అభివృద్ధి చేయాలనే కసి గురించి మాత్రమే.. దశాబ్దాలుగా నేను ఆయన్ను ప్రేరణగా తీసుకోలేదు. దాంతో పాటు విధానాల్లో కొత్తదనాన్ని తీసుకురావాలన్న ఆయన తపనతో కూడా ప్రేరణ పొందుతున్నాను. ఆయన తన స్థాయి మాత్రమే కాదు.. చుట్టూ ఉన్న వారందరి స్థాయిని పెంచుతారు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, ఇటీవల జరిగిన విశాఖ సీఐఐ సదస్సు సుపర్ హిట్ అయిందని.. సీఎం చంద్రబాబు అన్నారు. సీఐఐ సదస్సులో మొత్తం 613 ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. వీటి ద్వారా రాష్ట్రానికి రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 16 లక్షల మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో 5,587 మంది పాల్గొన్నారన్న చంద్రబాబు.. తాము అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే రూ. 20 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు సాధించామని పేర్కొన్నారు.