Waltair Veerayya : ఒకే థియేటర్ లో 365 రోజులు నడిచిన వాల్తేరు వీరయ్య
- Author : Sudheer
Date : 10-01-2024 - 1:09 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం సినిమా థియేటర్స్ లలో పెద్ద హీరో చిత్రమైన , చిన్న హీరో చిత్రమైన పట్టుమని పది రోజులు ఆడడం గగనమై పోయింది. ఓటిటి లు , ఐ బొమ్మ , మూవీ రూల్స్ వంటి సైట్స్ అందుబాటులో ఉండడంతో సినీ ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చి సినిమాలను చూడడం తగ్గించారు. బాగుందని టాక్ వస్తే తప్ప సినిమాను చూసేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదు. వచ్చిన ఇంట్లో ఒక్కరు తప్ప..ఫ్యామిలీ మొత్తం రావడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరల దృష్ట్యా సినిమాను చూసే ధైర్యం చేయడం లేదు..ఇలా పలు కారణాలతో థియేటర్స్ ప్రేక్షకులు లేక వెలవెల బోతున్నాయి. అందుకే నిర్మాతలు ఈ పది రోజుల్లో పెట్టిన పెట్టుబడి వచ్చేలా..పెద్ద ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తూ..టికెట్ ధరలను భారీగా పెంచేస్తున్నారు. ఇంత నడుస్తున్న కానీ మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మాత్రం ఏకంగా 365 రోజులు ఒకే థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించ బడి రికార్డు నెలకొల్పింది.
We’re now on WhatsApp. Click to Join.
మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా గత సక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదలైన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవితో పాటు రవితేజ(Ravi Teja) ఈ మూవీ లో నటించాడు. శ్రుతిహాసన్(Shruti Haasan) హీరోయిన్‌గా నటించగా..బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 236 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి గత ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
ఇక ఈ చిత్రం ఏపీలోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలతో విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా 365 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయనుంది. ఈ సందర్బంగా నిన్న మంగళవారం రామకృష్ణ థియేటర్‌లో చిరంజీవి అభిమానులు 365 రోజలు వేడుక చేసారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ఓ వాయిస్ నోట్ రిలీజ్ చేశారు. ‘ఈరోజుల్లో ఇది ఎవరూ టచ్ చేయలేని రికార్డ్. దీనికి కారణం మీకు నచ్చేలా సినిమాను మలిచిన డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ అందించిన డీఎస్పీ, నా తమ్ముడు రవితేజతో పాటు ఇతర నటులది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని చెప్పారు.
Read Also : MLA Kapu : కాంగ్రెస్ వైపు కాపు చూపు..?