HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mla Kapu Ramachandra Reddy Joined Congress

MLA Kapu : కాంగ్రెస్ వైపు కాపు చూపు..?

  • Author : Sudheer Date : 10-01-2024 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kapu Join Cng
Kapu Join Cng

ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి..మొన్నటి వరకు టీడీపీ , వైసీపీ , జనసేన , బిజెపి (పెద్దగా ప్రభావం లేదు ) లు మాత్రమే బరిలో నిల్చుంటాయని అనుకున్నారు..కానీ ఇప్పుడు వైస్ షర్మిల (YS Sharmila ) కాంగ్రెస్ (Congress) గూటికి చేరడం..త్వరలోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతుందని బలంగా వినిపిస్తుండడం తో..కాంగ్రెస్ నేతలంతా మళ్లీ యాక్టివ్ లోకి వస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, లగటపాటి రాజగోపాల్ , హర్ష వర్ధన్ ఇలా వైస్ హయాంలో కీలక నేతలుగా వ్యవహరించిన వారంతా బయటకు వస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులుగా ఉన్న నేతలు , కార్యకర్తలు , మాజీ ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా వైసీపీ పార్టీ టికెట్ రాని నేతలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు డిసైడ్ అవుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి..ఇప్పటికే వైసీపీ కి రాజీనామా చేయడం జరిగింది. ఈయన షర్మిల వెంట నడవబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (MLA Kapu Ramachandra Reddy) సైతం కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధం గా ఉన్నట్లు తెలుస్తుంది. కాపునకు వైసీపీ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రఘువీరారెడ్డితో కాపు రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. రఘువీరారెడ్డి నేతృత్వంలో ఈరోజు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ను కలుస్తారని సమాచారం.

కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని కాపు భావిస్తున్నారు. ఈ సందర్బంగా ఇక్కడ భారీ సభ ఏర్పటు చేసి..షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నాడు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రఘువీరారెడ్డితో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో తాను రఘువీరారెడ్డిని కలిసేందుకు వచ్చానని ఎమ్మెల్యే కాపు చెప్పుకొచ్చారు. కేవలం ఈయన మాత్రమే కాదు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు పట్టిన తర్వాత చాలామంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

Read Also : MP Kesineni Nani : వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్న కేశినేని నాని..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • MLA Kapu Ramachandra Reddy

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

    Latest News

    • టీమ్ ఇండియా విజయ యాత్రకు బ్రేక్.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం!

    • త‌మ పెళ్లిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విజ‌య్‌- ర‌ష్మిక‌!!

    • మీకు ఈ అల‌వాటు ఉందా? అయితే జుట్టుకు న‌ష్ట‌మే!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ బీపీ పెరిగినట్లే!

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

      • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

      • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

      • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

      • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd