HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tammareddy Slams Chiru For Her Comments On Casting Couch

క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

పరిశ్రమలో వేధింపులు లేవని చెప్పడం కరెక్ట్ కాదని, ఇక్కడ కూడా లైంగిక వాంఛలు తీర్చుకోవాలని చూసే వికృత ధోరణి కలిగిన వ్యక్తులు ఉన్నారని అంగీకరించారు. ముఖ్యంగా ఒకరిద్దరు పెద్దల ప్రమేయం కూడా ఇందులో ఉందనే సంచలన విషయాన్ని ఆయన బయటపెట్టారు.

  • Author : Sudheer Date : 30-01-2026 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiru Tammareddy
Chiru Tammareddy

Tollywood Casting Couch : సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ (లైంగిక వేధింపులు) అంశం మరోసారి చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు, వాటికి సింగర్ చిన్మయి ఇచ్చిన కౌంటర్ వీటిపై తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

ఇటీవల మన శంకర వరప్రసాద్ మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని, మహిళలు ఇక్కడ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా వ్యతిరేకించారు. పరిశ్రమలో జరుగుతున్న వాస్తవాలను చిరంజీవి వంటి పెద్దలు దాచిపెడుతున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, చిన్మయి మాటల్లో వాస్తవం ఉందని పేర్కొంటూ చిరంజీవి వ్యాఖ్యలను సున్నితంగా తప్పుపట్టారు.

Chiru Speech

Chiru Speech

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. పరిశ్రమలో వేధింపులు లేవని చెప్పడం కరెక్ట్ కాదని, ఇక్కడ కూడా లైంగిక వాంఛలు తీర్చుకోవాలని చూసే వికృత ధోరణి కలిగిన వ్యక్తులు ఉన్నారని అంగీకరించారు. ముఖ్యంగా ఒకరిద్దరు పెద్దల ప్రమేయం కూడా ఇందులో ఉందనే సంచలన విషయాన్ని ఆయన బయటపెట్టారు. అందరూ తప్పు చేయకపోయినా, కొందరు వ్యక్తుల వల్ల మొత్తం పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని, బాధితుల గోడును వినాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టాలీవుడ్‌లో ఏడాదికి సుమారు 250 సినిమాలు నిర్మితమవుతుంటే, అందులో 30 నుండి 40 చిత్రాలు కేవలం మహిళలను వాడుకోవడానికే తీస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది కాదనలేని వాస్తవమని, కేవలం వేధింపుల కోసమే సినిమాలు తీసే సంస్కృతి కొంతమందిలో ఉందని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • singer chinmayi
  • Tammareddy
  • tollywood
  • Tollywood Casting couch

Related News

Mehar Ramesh Event

Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

మెహర్ రమేష్ కుమార్తెకు, తోట చంద్రశేఖర్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

  • Boyapati Srinu

    కార్తీతో బోయపాటి శ్రీను క్రేజీ ప్రాజెక్ట్?

  • Actor JD Chakravarthy Reveals Unknown Facts

    JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

Latest News

  • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

  • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

  • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

  • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

  • Diesel Shortage : ఏపీలో లీటర్ డీజిల్ రూ.300

Trending News

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd